Jewel Thief : ‘జ్యూవెల్ థీఫ్’ మూవీ రివ్యూ..
జ్యూవెల్ థీఫ్ సినిమా దొంగ నుంచి మంచిగా మరిన ఓ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కున్నాడు అని సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపించారు.

Jewel Thief Movie Review and Rating
Jewel Thief : కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా తెరకెక్కిన సినిమా జ్యూవెల్ థీఫ్. పీఎస్ నారాయణ దర్శకత్వంలో శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై మల్లెల ప్రభాకర్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఎంఎం శ్రీలేఖ ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది. జ్యూవెల్ థీఫ్ సినిమా నవంబర్ 8న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికి వస్తే.. కృష్ణ (కృష్ణసాయి) బంగారు నగలు, వజ్రాలను దొంగతనం చేస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంగతనాలు చేసి వచ్చే డబ్బుని అనాథల కోసం ఖర్చుపెడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు నేహ(మీనాక్షి జైస్వాల్) నెక్లెస్ దొంగతనం చేసి జైలుకు వెళతాడు. అయితే కృష్ణ మంచితనం గురించి తెలుసుకున్న నేహా అతడితో ప్రేమలో పడుతుంది.
కృష్ణ జైలు నుంచి తిరిగి వచ్చాక ఎలాంటి మోసం, దొంగతనం చేయకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలనే కండిషన్ పెడుతుంది నేహా. దీంతో ఓ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అనారోగ్యంతో ఉన్న పెద్ద వయసు వ్యక్తిని చూసుకునే పనిలో చేరతాడు. అయితే కృష్ణ ఓ హత్యలో ఇరుక్కుంటాడు. అతన్ని హత్యలో ఇరికించింది ఎవరు? కృష్ణను ఎవరు మోసం చేసారు? కృష్ణ – నేహా ప్రేమ ఫలించిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Pushpa 2 : శ్రీలీలతో ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్.. ఫోటో లీక్..
సినిమా విశ్లేషణ.. దొంగగా ఉన్న వ్యక్తి ఓ అమ్మాయి వల్ల మంచిగా మారిన కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ జ్యూవెల్ థీఫ్ కూడా అదే కోవలోకి చెందిన సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా హీరో చేసే దొంగతనాలతో, అతను చేసే మంచి, హీరోయిన్ తో ప్రేమతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ సినిమాలా అతనిపై హత్య కేసు పడితే ఎలా బయటపడ్డాడు అని చూపించారు. పాయింట్ బాగున్నా కొన్ని చోట్ల సాగదీసి సింపుల్ కథనంతో చెప్పారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కృష్ణ సాయి దొంగ పాత్రలో బాగా నటించాడు. మీనాక్షి జైస్వాల్ తన అందంతో అలరించింది. అజయ్ నెగిటివ్ పాత్రలో మెప్పించాడు, ప్రేమ, పృథ్వి, శివారెడ్డిలు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక అంశాలు.. ఎంఎం శ్రీలేఖ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. స్టంట్స్ బాగానే డిజైన్ చేసారు. దర్శకుడిగా పి.ఎస్ నారాయణ జ్యూవెల్ థీఫ్ ని సింపుల్ కథ, కథనంతో కమర్షియల్ పాయింట్స్ తో బాగానే తెరకెక్కించారు.
మొత్తంగా జ్యూవెల్ థీఫ్ సినిమా దొంగ నుంచి మంచిగా మరిన ఓ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కున్నాడు అని సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రేటింగ్ & రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.