Jiah Khan: జియా ఖాన్ నిజంగా వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందా.. పదేళ్ల తరువాత తీర్పు ఏం చెబుతోంది..?

బాలీవుడ్ బ్యూటీ జియా ఖాన్ మరణించిన పదేళ్ల తరువాత ఆమె ప్రియుడు సూరజ్ పంచోలిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చింది. దీంతో ఆమె మరణానికి గల అసలు కారణాలు ఏమిటా అనే కొత్త చర్చకు తెరలేచింది.

Jiah Khan: జియా ఖాన్ నిజంగా వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందా.. పదేళ్ల తరువాత తీర్పు ఏం చెబుతోంది..?

Jiah Khan Suicide Remains Still A Mystery

Updated On : April 28, 2023 / 4:59 PM IST

Jiah Khan: బాలీవుడ్ భామ జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్న పదేళ్ల తరువాత ఆమె ప్రియుడిని కోర్టు నిర్దోషిగా తేలుస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. దీంతో జియా ఖాన్ మరణంపై మరోసారి చర్చ జరుగుతోంది. సినిమాల్లో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన జియా ఖాన్, కేవలం మూడు సినిమాలు చేసి ఆత్మహత్య చేసుకోవడంతో అప్పట్లో పలు అనుమానాలు రేగాయి. అయితే, ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి జియాను వేధించాడని.. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం.. అతడిని జైలులో పెట్టడంతో ఈ కేసు ముగిసిందని అందరూ అనుకున్నారు.

Jiah Khan : బాలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్య కేసులో పదేళ్ల తర్వాత తీర్పు.. నిర్దోషిగా విడుదలైన నిందితుడు..

కానీ, పదేళ్ల తరువాత జియా ఖాన్ కేసులో ఆమె ప్రియుడు నిర్దోషిగా తేలడంతో ఇప్పుడు మరోసారి ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది. జియా ఖాన్ మరణం వేనుక అసలు కారణం ఏమై ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. నిజంగానే జియా ఖాన్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందా.. ఒకవేళ అదే నిజమైతే, ఆమె ప్రియుడికి శిక్ష పడేది.. కానీ, ఇవాళ అతడు నిర్దోషిగా విడుదల కావడం కొత్త చర్చకు దారితీస్తోంది.

సినిమాల్లో రాణించాలని, తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది జియా ఖాన్. అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ హీరోతో బోల్డ్ పాత్రలో నటించిన, ఆయనతో రొమాన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది జియా ఖాన్. ఆ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత జియా చేసిన రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆమె సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోయింది. ప్రియుడు సూరజ్ పంచోలితో రిలేషన్‌లో ఉన్న జియా ఖాన్, ఒక్కసారిగా సూసైడ్ చేసుకోవడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది.

suicide prevention : అలాంటి వ్యక్తిని గుర్తించడం ఎలా?

అప్‌కమింగ్ హీరోయిన్ సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆమె సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రియుడు సూరజ్‌ను అరెస్ట్ చేశారు. కానీ, పదేళ్ల తరువాత అతడు నిర్దోషి అని తేలడంతో.. జియా ఖాన్ ఆత్మహత్యకు వేధింపులు కారణం కాదనే వాదన వినిపిస్తోంది. మరి జియా ఖాన్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కారణాలు ఏమై ఉంటాయా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆర్థికంగా బాగానే ఉన్నా, సినిమా ఛాన్స్‌లు కూడా అప్పుడేప్పుడే వస్తుండటం.. ఇలా ఎటు చూసినా ఆమెకు ఆత్మహత్య చేసుకునే సమస్యనైతే కనిపించలేదు. మరి జియా ఖాన్ సూసైడ్‌కు గల అసలు మిస్టరీ వీడేది ఎప్పుడో కాలమే చెబుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.