M4M Movie : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘M4M’ డైరెక్టర్, హీరోయిన్..
హీరోయిన్ జో శర్మ వెరైటీ మోడ్రన్ డ్రెస్ లలో కేన్స్ రెడ్ కార్పెట్ పై అలరించింది.

Jo Sharma and Mohan Vadapatla Participated in Cannes Film Festival with M4M Movie
M4M Movie : గతంలో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో.. లాంటి సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘M4M’ (Motive for Murder). ఈ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇటీవల స్క్రీనింగ్ జరిగింది. ఈ సినిమాలో ఇండో అమెరికన్ నటి జో శర్మ మెయిన్ లీడ్ లో నటించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి ఈ సినిమా డైరెక్టర్, హీరోయిన్ హాజరయి సందడి చేసారు.
హీరోయిన్ జో శర్మ వెరైటీ మోడ్రన్ డ్రెస్ లలో కేన్స్ రెడ్ కార్పెట్ పై అలరించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు. సినిమా రిలీజ్ కి ముందే పలు ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని అవార్డులు, రివార్డులు అందుకుంది. ఇటీవల జో శర్మ వేవ్స్ సమ్మిట్ లో కూడా పాల్గొంది. కేన్స్ లో ఈ సినిమా చూసిన వివిధ దేశాల ప్రేక్షకులు అభినందనలు తెలియచేసారు.
Also Read : Jr NTR : ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే.. బర్త్ డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్..
మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్‌విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన M4M కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు రెడీ అవుతుంది.