Dasara Movie : దసరా సినిమాకు డబ్బులు ఇవ్వలేదు.. 23 మందికి నేనే ఇచ్చాను.. 70 వేలు లాస్.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..

 సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు మోసాలు జరుగుతాయని వింటూ ఉంటాము. కొంతమంది సినిమాకు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఎక్కువగా వింటాము. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్(Junior Artist) ఏజెంట్, సింగర్(Singer) ఇలాంగే కామెంట్స్ చేశారు.

Dasara Movie : దసరా సినిమాకు డబ్బులు ఇవ్వలేదు.. 23 మందికి నేనే ఇచ్చాను.. 70 వేలు లాస్.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..

Junior artist agent and singer srinu sensational comments on Dasara Movie team

Singer Srinu :  సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు మోసాలు జరుగుతాయని వింటూ ఉంటాము. కొంతమంది సినిమాకు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఎక్కువగా వింటాము. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్(Junior Artist) ఏజెంట్, సింగర్(Singer) ఇలాంగే కామెంట్స్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన లోకల్ సింగర్ శ్రీను సినీ పరిశ్రమకు వచ్చి సింగర్ గా, ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతి వర్క్ ని చేసుకుంటూ వెళ్తున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా, బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ గా.. చేస్తూనే సింగర్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా శ్రీను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులను చీప్ గా చూస్తారు. వచ్చేదాకా మంచిగా మాట్లాడుకొని తీసుకెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక సరిగ్గా పట్టించుకోరు. డబ్బులు కూడా సగం సగం ఇస్తారు. నేను ఇటీవల చాలా పెద్ద సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. కొంతమంది డబ్బులు కూడా ఇవ్వరు. ఇటీవల దసరా సినిమాకు 23 మందిని తీసుకొని గోదావరిఖని వెళ్ళాను. వారం రోజులు షూట్,అక్కడే ఉన్నాము. అయిన తర్వాత ఇప్పటివరకు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. నా చేతుల నుంచి 70 వేలు ఖర్చు అయింది. నేను తీసుకెళ్లిన వాళ్ళు నన్నే అడుగుతారు. నేను కూడా మొత్తం ఇవ్వలేదు సగం సగమే ఇచ్చాను, నా దగ్గర ఉన్నంతలో. ఇలా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి అని అన్నాడు.

Vyuham : ఆర్జీవీ వ్యూహం కథ ఇదే.. వ్యూహం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పొలిటికల్ సినిమాలు తీయను.. ఆర్జీవీ వ్యాఖ్యలు..

దీంతో ఇతను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలువురు ఇతనికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక దసరా సినిమా నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కగా భారీ విజయం సాధించి 100 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే.