Sri Sri Sri Raja Vaaru: హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. ఫస్ట్ లుక్ అదుర్స్!
టాలీవుడ్ లో నాలుగైదు కుటుంబాల నుండి నట వారసులు వస్తూనే ఉన్నారు. మెగా-అల్లు కుటుంబంలో ఇప్పటికే డజనుకు దగ్గరగా హీరోలున్నారు. అక్కినేని కుటుంబం నుండి కూడా ఐదుగురు ఉన్నారు.

Sri Sri Sri Raja Vaaru
Sri Sri Sri Raja Vaaru: టాలీవుడ్ లో నాలుగైదు కుటుంబాల నుండి నట వారసులు వస్తూనే ఉన్నారు. మెగా-అల్లు కుటుంబంలో ఇప్పటికే డజనుకు దగ్గరగా హీరోలున్నారు. అక్కినేని కుటుంబం నుండి కూడా ఐదుగురు ఉన్నారు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి ఈ మధ్యనే మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమయ్యాడు. ఇక దగ్గుబాటి నుండి రానా తమ్ముడు అభిరాం కూడా త్వరలోనే హీరోగా వస్తుండగా.. నందమూరి కుటుంబం నుండి మాత్రం ఇప్పటి వరకు ఆ ముగ్గురే కనిపిస్తున్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే.
Jr NTR: చిల్ అవుతున్న తారక్.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్!
కాగా.. ఇప్పుడు నందమూరి కుటుంబంతో అనుబంధమున్న మరో హీరో రాబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్వయానా బావమరిది అయిన నార్నే నితిన్ చంద్ర హీరోగా వెండితెర మీదకి రాబోతున్నాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతికి తమ్ముడైన నితిన్ చంద్ర హీరోగా రాబోతున్నాడని ఏడాదిగా వినిపిస్తూనే ఉండగా.. తాజాగా తన సినిమా ఫస్ట్ లుక్ వదిలి అటెన్షన్ క్రియేట్ చేశాడు. శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పొస్టర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్.
Jr NTR: టాప్ 10 దర్శకులతో తారక్.. సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్!
‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు మొదలవగా తాజాగా వదిలిన ఫస్టులుక్ పోస్టర్ తో ఇది ఇంకాస్త పెరిగింది. ఇందులో జాతర నేపథ్యంలో నడుస్తూ సిగరెట్ వెలిగించే ఈ పోస్టర్ లో నితిన్ మాస్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన సతీశ్ వేగేశ్న ఇప్పుడు రూట్ మార్చి ఇలా రాబోతుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇది మాస్ సినిమా అని హింట్ ఇచ్చేసినట్లే కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నితిన్ చంద్రను హీరోగా నిలబెడుతుందో చూడాలి.