Jyothi : బాబు పుట్టిన రెండేళ్లకే డైవర్స్.. ఒకరి మీద కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకొని..

జ్యోతి తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది.(Jyothi)

Jyothi : బాబు పుట్టిన రెండేళ్లకే డైవర్స్.. ఒకరి మీద కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకొని..

Jyothi

Updated On : November 16, 2025 / 2:23 PM IST

Jyothi : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి సడెన్ గా కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమైన కొన్నేళ్ల తర్వాత మళ్ళీ బిగ్ బాస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి అడపాదడపా సినిమాలు చేస్తూ టీవీ షోలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. జ్యోతి తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది.(Jyothi)

జ్యోతి మాట్లాడుతూ.. బాబు పుట్టిన రెండేళ్లకే డైవర్స్ తీసుకున్నాను. అప్పట్నుంచి ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నాను. తెలిసి తెలియని ఏజ్ లో నాకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండేది. ఒక అబ్బాయి లవ్ చేశాను వాడు మోసం చేసి వెళ్ళిపోతే ఆ కోపంతో ఇంకో అబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తే వెంటనే పెళ్లి చేసేసుకున్నాను. నేను తీసుకున్న పెద్ద తప్పుడు నిర్ణయం అదే. నా లైఫ్ లో అదే బ్లాక్ మార్క్. కానీ దానివల్ల నాకు కొడుకు ఉన్నాడు. ఇప్పుడు వాడి కోసమే బతుకుతున్నాను. కొడుకు విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను. డైవర్స్ అయ్యాక సింగిల్ గా ఉండి చాలా స్ట్రగుల్ అయ్యా. సినిమాలు లేవు, డబ్బులు లేవు. అపుడు జీవితం తెలిసింది. అప్పటిదాకా లైఫ్ ని సీరియస్ గా తీసుకోలేదు. సింగిల్ మదర్ గా నేను పెయిన్ చూసాను అని తెలిపింది.

Also Read : Mahesh Babu : డ్యూయల్ రోల్ లో మహేష్.. రాముడు – శివుడు.. షర్ట్ లేకుండా.. రాజమౌళి ప్లానింగ్ గట్టిగానే ఉందిగా..

అయితే మళ్ళీ పెళ్లి చేసుకోరా అని ప్రశ్నించగా జ్యోతి సమాధానమిస్తూ.. నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ నా బాధ్యతలు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. నాకు మంచి పార్ట్నర్ కావలి. నన్ను ప్రిన్సెస్ లాగా చూసుకొని, నా బాధ్యతలు కూడా తీసుకునేవాళ్ళు కావాలి అని తెలిపింది.