చైనాలో రిలీజ్ కానున్న కాబిల్

2019 జూన్ 5న చైనాలో విడుదలవబోతున్నబాలీవుడ్ మూవీ కాబిల్..

  • Published By: sekhar ,Published On : May 14, 2019 / 12:59 PM IST
చైనాలో రిలీజ్ కానున్న కాబిల్

Updated On : May 14, 2019 / 12:59 PM IST

2019 జూన్ 5న చైనాలో విడుదలవబోతున్నబాలీవుడ్ మూవీ కాబిల్..

బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా, సంజయ్ గుప్తా దర్శకత్వంలో, రాకేష్ రోషన్ నిర్మించిన సినిమా, కాబిల్.. ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఇద్దరూ అంధులే.. 2017 జనవరి 25న భారీ అంచనాల మధ్య విడుదలైన కాబిల్, బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఏదో ప్రయోగం చేసారులే అనే పేరు కాదు కదా, నిర్మాతని నిండా ముంచేసింది. ఇప్పుడీ సినిమా టాపిక్ ఎందుకొచ్చిందంటే, కాబిల్ మళ్ళీ రిలీజ్ కానుంది. బాబోయ్, ఏంటి మళ్ళీనా? అని షాకవ్వకండి. రిలీజవుతుంది ఇండియాలో కాదు, చైనాలో.

2019 జూన్ 5న కాబిల్ చైనాలో విడుదలవబోతున్నట్టు ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంకో హైలెట్ ఏంటంటే చైనాలో రిలీజవుతున్న హృతిక్ రోషన్ ఫస్ట్ సినిమా ఇదే. సినిమాని అక్కడ విడుదల చేస్తున్నట్టు చైనీస్‌లో పోస్టర్స్ కూడా వదిలారు. శ్రీదేవి నటించిన మామ్ ఇటీవలే చైనాలో విడుదలై ఘనవిజయం సాధించింది. చైనా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్ళు రాబడుతుంది మామ్. మరి ఇండియాలో డిజాస్టర్ అయిన కాబిల్, చైనా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.