Kadambari Kiran : మరోసారి కాదంబరి కిరణ్ ‘మనంసైతం’ మానవత్వం.. పేదలకు దిల్ రాజు చేతుల మీదుగా చెక్కుల పంపిణి..
పదేళ్లుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

Kadambari Kiran Helped Poor People from his Manam Saitham Foundation
Kadambari Kiran : సినీ నటుడు కాదంబరి కిరణ్ ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం'(Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి సహాయాన్ని అందిస్తున్నారు. పదేళ్లుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరుగురు పేదలకు నిర్మాత దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు పంపిణి చేశారు. ఫిలిం ఛాంబర్(Film Chamber) లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మరింతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… ‘మనం సైతం’ ఫౌండేషన్ మొదలైనప్పటి నుంచి నాకు అండగా ఉంటున్న కళామతల్లి ముద్దు బిడ్డలు అందరికి పాదాభివందనాలు. గడిచిన పదేళ్లలో పేదలైన సినీ కార్మికులకు కోటి రూపాయాలకు పైగా సహాయం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఙతలు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేదల దగ్గర్నుంచి నన్ను సాయం అడిగేవారికి తోచినంత సాయం చేస్తున్నాను. తిత్లీ తూఫాన్, కర్నూలు వరదలు, కేరళ వరదల సమయంలో అందరి సహాకారంతో సహాయం చేశాము. ఎంతోమందికి సాయం చేరుతున్నా దాతల దగ్గరికి ఇంకా వెళ్లట్లేదని అనిపించింది. ఇది తెలుసుకొని పలువురు ఇండస్ట్రీ పెద్దలు ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, దాము గారు, వివి వినాయక్, జయసుధ గారు తమ సహాకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వచ్చి అవసరంలో ఉన్న పేదలకు దిల్ రాజు, దాము, ప్రసన్న కుమార్ చేతుల మీదుగా 25 వేలు చొప్పన చెక్కుల పంపిణి అందజేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. దేవుడు ఉన్నాడా..? లేడా.? చర్చ రెగ్యూలర్ గా వింటాము. అది మనకు తెలియకపోయినా నమ్మేవాళ్లు నమ్ముతారు, నమ్మని వాళ్లు నమ్మరు. మనిషి ద్వారా ఎదుటి మనిషికి సాయం పొందినప్పుడే దేవుడున్నాడని కొందరు నమ్ముతారు. ‘మనం సైతం’ సేవ కార్యక్రమాలు చూస్తుంటే దేవుడికి, మనిషికి కాదంబరి కిరణ్ ఓ వారధి, ఇలాంటివి చూసినప్పుడు దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. సినీ పెద్దలు, స్నేహితుల సపోర్ట్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీ చివరి శ్వాస వరకు ఈ సేవలు కొనసాగించాలి, మీకు మేమంతా తోడుంటం అని కాదంబరి కిరణ్ ని అభినందించారు.
Also Read : Theatrical Movies : ఈ వారం థియేటర్స్‌లో తెలుగులో రిలీజయ్యే అయ్యే సినిమాలు ఇవే..
ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సాయం చెయ్యాలని ఉంటుంది. కొంతమందికి ఆ సాయం వెనుక ఓ లక్ష్యం ఉంటుంది. పదేళ్ల క్రితం నా దగ్గరికి కాదంబరి కిరణ్ వచ్చినప్పుడు అదే అడిగితే అలాంటిది ఏం లేదు అన్నాడు. తొమ్మిదేళ్లుగా గమనిస్తున్నాను. అ రోజు నుంచి ఇవాళ్టికి అలాగే పనిచేస్తున్నారు. సహాయం చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. కానీ డబ్బు తెచ్చి అవసరాల్లో ఉన్నవారికి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది అంత ఈజీ కాదు. కాదంబరి పౌండేషన్ ద్వారా ఓ ఓల్డేజ్ హోం కట్టాలని అనుకుంటున్నారు. అది నేరవేరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.