Kadambari Kiran : మరోసారి కష్టాల్లో ఉన్న సినీ వ్యక్తులకు సాయం చేసిన కాదంబరి కిరణ్..

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియ‌ర్ నటి రంగస్థలం లక్ష్మికి మనం సైతం ఫౌండేషన్ నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం అందచేశారు కాదంబరి కిరణ్.

Kadambari Kiran : మరోసారి కష్టాల్లో ఉన్న సినీ వ్యక్తులకు సాయం చేసిన కాదంబరి కిరణ్..

Kadambari Kiran Helped so many People at a time in Film Industry from his Manam Saitham Foundation

Updated On : January 27, 2024 / 6:41 PM IST

Kadambari Kiran : సినీ నటుడు కాదంబరి కిరణ్ ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం'(Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఒకేసారి పలువురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు, బయటి వ్యక్తులకు ఆర్ధిక సాయం అందించారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియ‌ర్ నటి రంగస్థలం లక్ష్మికి మనం సైతం ఫౌండేషన్ నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం అందచేశారు కాదంబరి కిరణ్. అలాగే ఎనుముల విదిష అనే బాలిక‌కు ముక్కుకు సంబంధించిన ఆప‌రేష‌న్ కోసం 25,000 ఆర్థిక సాయం చేశారు. వీటితో పాటు సినీ ఆర్టిస్ట్, డాన్సర్ సూరేపల్లి చంద్రకళ చదువుల్లో కూడా రాణిస్తుండటంతో ఆమె ఉన్న‌త చ‌ద‌వుల కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి సాయం కోరగా కాదంబరి కిరణ్ 25,000 రూపాయలు అందించారు.

Kadambari Kiran Helped so many People at a time in Film Industry from his Manam Saitham Foundation

Also Read : Sandeep Vanga – Chiranjeevi : మెగాస్టార్‌తో యానిమల్ సందీప్ వంగ.. ఆ డైరెక్టర్ కూడా.. సినిమా ప్లాన్ చేస్తారా?

ఇటీవలే సీనియ‌ర్ న‌టి పావ‌ల శ్యామ‌ల కష్టాల గురించి తెలుసుకొని కాదంబరి కిరణ్ మనం సైతం నుంచి 25,000 ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆమెకు 6 వేల రూపాయలు అందించారు. గత పదేళ్లుగా ఇలా సినీ పరిశ్రమలోని కుటుంబాలకి సహాయం చేస్తూ, ఇంకా చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు కాదంబరి కిరణ్.