Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు.. కోలుకుంటున్నట్టు కూతురు ప్రకటన

కొంతమంది ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. వీటికి సమాధానంగా ఇవాళ ఉదయం కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నట్టు ఆయన కూతురు రమాదేవి..........

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు.. కోలుకుంటున్నట్టు కూతురు ప్రకటన

Kaikala

Updated On : November 23, 2021 / 11:01 AM IST

Kaikala Satyanarayana :  60 ఏళ్లకు పైగా ఎన్నో సినిమాల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా నటించి జనాల్ని అలరించారు కైకాల సత్యనారాయణ. గత కొద్ది కాలంగా వయోభారంతో సినిమాలకి దూరమయ్యారు. ఇటీవల కైకాలకి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. అప్పట్నుంచి ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Brahmanandam : బుల్లితెరపై ‘బ్రహ్మానందం’… ఆలీతో కలిసి రచ్చ.. టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం

అయితే కొంతమంది ఆయన ఆరోగ్యంపై అనవసరమైన ప్రకటనలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారు. కొంతమంది ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. వీటికి సమాధానంగా ఇవాళ ఉదయం కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నట్టు ఆయన కూతురు రమాదేవి ఓ ఆడియో బైట్ ని పంపించారు.

Anee Master : బిగ్ బాస్ 11 వారాలకి యాని మాస్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

ఆ ఆడియోలో రమాదేవి మాట్లాడుతూ… ”అందరికి నమస్కారం. నేను కైకాల సత్యనారాయణ గారమ్మాయి రమాదేవిని. నాన్న గారు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. డాక్టర్స్ అందించే చికిత్సకి స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు కూడా. దయచేసి ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు. అలాగే దయచేసి ఆయన ఆరోగ్యంపై అనవసర వార్తలను రాయడం, ప్రసారం చేయడం లాంటివి చేయకండి. ఆయన ఆరోగ్యంపై అనవసర వార్తలను ప్రసారం చేసి జనాల్ని ఆందోళన పరచవద్దు” అని తెలిపారు.

Anee Master : మీకు బుద్ధి లేదా?? నెటిజన్స్ పై ఫైర్ అయిన యాని మాస్టర్

ప్రస్తుత సమాచారం ప్రకారం కైకాల సత్యనారాయణ అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు.