Anee Master : మీకు బుద్ధి లేదా?? నెటిజన్స్ పై ఫైర్ అయిన యాని మాస్టర్

షోలోనే తనని అన్యాయంగా ఎలిమినేట్ చేసారని బాగా ఫైర్ అయింది యాని. బయటకి వచ్చాక కూడా తన కోపాన్ని చూపిస్తుంది. కాజల్, సన్నీ కలిసి యాని మాస్టర్ వెళ్ళేలాగా చేసారని......

Anee Master : మీకు బుద్ధి లేదా?? నెటిజన్స్ పై ఫైర్ అయిన యాని మాస్టర్

Anee

Anee Master :  బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన యానీ మాస్టర్‌ చాలా కోపంగా ఉంది. షోలోనే తనని అన్యాయంగా ఎలిమినేట్ చేసారని బాగా ఫైర్ అయింది యాని. బయటకి వచ్చాక కూడా తన కోపాన్ని చూపిస్తుంది. కాజల్, సన్నీ కలిసి యాని మాస్టర్ వెళ్ళేలాగా చేసారని అందరూ అనుకుంటున్నారు. ఇదే కోపంతో యాని కాజల్ తో వచ్చే ముందు కూడా మాట్లాడలేదు. ఇక షో నుంచి బయటకి వచ్చాక ఫస్ట్ టైం సోషల్ మీడియాలోకి వచ్చింది.

Bigg Boss 5 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్ళే

”బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో జరిగే గొడవలను చూస్తున్నా. మీరు మొదటి నుంచి 11 వారాల వరకు చూడటం లేదా? మీరు ఒకరికి ఫాలోవర్ కావచ్చు, అభిమానే కావచ్చు కానీ ఆ వ్యక్తి తప్పు చేసినా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీ అభిమాన కంటెస్టెంట్ ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు కానీ నేను డ్యాన్స్‌ చేస్తే మాత్రం చులకన చేస్తున్నానని, వెక్కిరిస్తున్నాను అని దాన్ని బాగా హైలైట్‌ చేశారు. అంటే ఒకరిని అమ్మేస్తాననడం మీరు లైట్ తీసుకున్నప్పుడు నా డ్యాన్స్‌ మాత్రం ఎందుకింత హైలైట్‌ చేస్తున్నారు” అంటూ నెటిజన్స్ మీద ఫైర్ అయింది.

NTR : నిన్న పెద్ద కొడుకు.. ఇవాళ చిన్న కొడుకు.. ఫారిన్‌లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

దాంతో పాటు రవిపై, రవి ఫ్యామిలీపై జరుగుతున్న మాటల దాడిని కూడా ఖండించింది. ”నేను రవి భార్య నిత్యతో మాట్లాడాను. ఆమె కూతురు వియూ వీడియోల కింద బ్యాడ్‌ కామెంట్లు పెడుతున్నారు. ఐదేళ్ల చిన్న పాపండీ. ఇది కరెక్ట్‌ కాదు. మేమంటే భరిస్తాం, కానీ చిన్నపిల్లల వీడియోల మీద ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత ద్వేషం? మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్ ఇదే చేయమన్నారా మిమ్మల్ని? అసలు మీకు బుద్ధి లేదా? వియు వీడియోలకు చెడ్డ కామెంట్లు చేయడం ఆపండి” అని ఓ రేంజ్ లో ఫైర్ అయింది యాని మాస్టర్.