Kajal Aggarwal : కాజల్ కుర్రాళ్ల మనసులు ముక్కలు చేసి ఏడాది..
శనివారం (అక్టోబర్ 30) కాజల్ కిచ్లు కపుల్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు..

Kajal
Kajal Aggarwal: దాదాపు 10 ఏళ్లకు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. పాండమిక్ టైంలో గతేడాది అక్టోబర్ 30న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?
శనివారం (అక్టోబర్ 30) ఈ జంట తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న కాజల్.. ఓ పిక్ షేర్ చేస్తూ ‘ నువ్వు అర్థరాత్రి గుసగుసలాడుతున్నప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్వు మేల్కునే ఉన్నావా? నీకు ఈ కుక్క వీడియో చూపించాలి’ అంటూ కాస్త ఫన్నీగానూ మరికొంచెం ఎమోషనల్‌గానూ పోస్ట్ చేసింది.
Kajal Aggarwal : ఇదీ కాజల్ క్రేజ్
ఇదిలా ఉంటే కాజల్ ప్రెగ్నెంట్ అంటూ గతకొద్ది రోజులుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ పూర్తి చేసిన కాజల్.. నాగార్జున పక్కన ‘ఘోస్ట్’ మూవీలో చేస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి తప్పుకుంది కాజల్. ఆమె ప్లేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారు మేకర్స్. అయితే కాజల్ గర్భవతిగా ఉన్నందుకే ఈ సినిమా చెయ్యట్లేదని తెలుస్తోంది. ఏదమైనా కాజల్ రియాక్ట్ అయితే కానీ ఈ వార్తలకు శుభం కార్డ్ పడదు.
View this post on Instagram