Kajal Aggarwal: ఉగాది కానుకగా కాజల్ కొత్త మూవీ.. భయపెడుతుందా?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత చాలా తక్కువగా సినిమాలు చేస్తూ కనిపించింది. ఇక ఓ బిడ్డకు తల్లి కూడా అయిన కాజల్, ఇప్పుడు మళ్లీ తన జోరును పెంచుతోంది. తాను వరుసగా నటిస్తున్న సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక హార్రర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘ఘోస్టీ’ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టేందుకు వస్తోంది కాజల్. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్.

Kajal Aggarwal Ghosty Locks Release Date
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత చాలా తక్కువగా సినిమాలు చేస్తూ కనిపించింది. ఇక ఓ బిడ్డకు తల్లి కూడా అయిన కాజల్, ఇప్పుడు మళ్లీ తన జోరును పెంచుతోంది. తాను వరుసగా నటిస్తున్న సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక హార్రర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘ఘోస్టీ’ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టేందుకు వస్తోంది కాజల్. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్.
Kajal Aggarwal: హార్రర్ కామెడీగా కాజల్ కొత్త సినిమా.. శాటిలైట్ రైట్స్ ఆ చానల్‌కే!
తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో కాజల్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తోంది. ఒకటి పోలీస్ పాత్ర కాగా, మరోటి సినిమా హీరోయిన్. కాగా, ఈ సినిమాలో ఓ దెయ్యం బారిన పడిన కాజల్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేది మనకు ఫన్నీగా చూపెట్టబోతున్నారు.
Kajal Aggarwal : కాజల్ కంబ్యాక్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.. చేతిలో అరడజను ప్రాజెక్టులు..
ఇక యోగి బాబు అండ్ గ్యాంగ్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో కెఎస్.రవికుమార్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 17న రిలీజ్ అవుతున్న ఘోస్టీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అభిమానులు చూస్తున్నారు.