Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?
కాజల్ ఏం ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతోంది?.. అందరూ అనుకుంటున్నట్లు ఆ వార్తేనా?..
Kajal Aggarwal : దాదాపు దశాబ్ద కాలానికి పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. పాండమిక్ టైంలో గతేడాది అక్టోబర్ 30న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?
అయితే కొద్ది రోజులుగా కాజల్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాజల్ కిచ్లు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, అందుకే చేతిలో ఉన్న సినిమాలు తప్ప కొత్తవి కమిట్ అవడంలేదని అంటున్నారు.. అందుకే నాగార్జున సినిమా నుంచి ఆమెను తప్పించారని టాక్..
Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?
కట్ చేస్తే.. కాజల్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది. ‘ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్.. స్టే ట్యూన్డ్’ అంటూ కాజల్ పోస్ట్ చేసింది. దీంతో తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యనుందంటున్నారు సినీ వర్గాలవారు.