Kajal Aggarwal: కాజల్ రీసెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎందులో అంటే?
అందాల భామ కాజల్ అగర్వాల్ నటించిన రీసెంట్ మూవీ ‘ఘోస్టీ’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Kajal Aggarwal Recent Movie Ghosty Streaming In OTT
Kajal Aggarwal: అందాల భామ కాజల్ అగర్వాల్, తల్లి అయిన తరువాత నటించిన రీసెంట్ మూవీ ‘ఘోస్టీ’. హార్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించగా, ఈ సినిమాను ఇటీవల థియేటర్లలో రిలీజ్ చేశారు.
Kajal Aggarwal: మరో సినిమాతో వస్తున్న కాజల్.. రిలీజ్ సరే.. ప్రమోషన్స్ ఎక్కడ..?
కానీ, ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోవడం, ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజింగ్ చేయకపోవడంతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి చాలా తక్కువ మందికి తెలిసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూడని వారి కోసం ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.
Kajal Aggarwal: ఉగాది కానుకగా కాజల్ కొత్త మూవీ.. భయపెడుతుందా?
ఇక ఈ సినిమాలో యోగి బాబు, రాధిక శరత్‌కుమార్, కెఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్లీ, ఆడుకలం నరేన్, ఊర్వశి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, ఈ సినిమాను సీడ్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారో చూడాలి.