Kajal Aggarwal : కాజల్ తనయుడి ఫస్ట్ బర్త్ డే.. అందరూ ఒకే టీ షర్ట్స్‌లో.. కాజల్ ఫ్యామిలీ స్పెషల్ పిక్ చూశారా..

ఇటీవల కాజల్ తనయుడు నీల్ కిచ్లు మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. నీల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మొదటి బర్త్ డే అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది.

Kajal Aggarwal : కాజల్ తనయుడి ఫస్ట్ బర్త్ డే.. అందరూ ఒకే టీ షర్ట్స్‌లో.. కాజల్ ఫ్యామిలీ స్పెషల్ పిక్ చూశారా..

Kajal Aggarwal son neil kitchlu first birthday photo goes viral

Updated On : April 26, 2023 / 9:58 AM IST

Kajal Aggarwal : ఒకప్పుడు తెలుగు(Telugu), తమిళ్(Tamil) లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). కరోనా సమయంలో సడెన్ గా ముంబైకి చెందిన బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని(Gautam Kitchlu) పెళ్లి చేసుకుంది. అనంతరం ఓ బాబుకు తల్లి అయింది. దీంతో గత మూడేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంది కాజల్. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. కాజల్ తనయుడు నీల్ కిచ్లు(Neil Kitchlu) క్యూట్ ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల కాజల్ తనయుడు నీల్ కిచ్లు మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. నీల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మొదటి బర్త్ డే అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది. తాజాగా నీల్ కిచ్లు మొదటి పుట్టిన రోజు సెలబ్రెస్షన్స్ కి సంబంధించిన ఓ ఫోటోని కాజల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో కాజల్ ఫ్యామిలీ, భర్త గౌతమ్ కిచ్లు ఫ్యామిలీ అందరూ ఉన్నారు. అందరూ వైట్ టీ షర్ట్స్ వేసుకున్నారు.

Bhumika : ఇప్పటికీ సీనియర్ మహిళా ఆర్టిస్టులకు సరైన పాత్రలు ఇవ్వట్లేదు.. వాళ్ళను చూసి నేర్చుకోండి..

ఈ టీ షర్ట్స్ మీద ఫ్యామిలీ అంతా నీల్ కిచ్లుకి ఏమవుతారో వారి రిలేషన్ రాపించారు. దీంతో ఆ టీ షర్ట్స్ కూడా క్యూట్ గా ఉన్నాయి. ఇలా కాజల్ ఫ్యామిలీ మొత్తం నీల్ కిచ్లు మొదటి బర్త్ డేకి ఒకే రకం టీ షర్ట్స్ వేసుకొని గ్రూప్ ఫొటో దిగడంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యామిలీ ఫొటో చాలా క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.