Bigg Boss 5: కాజల్, ఆనీ.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో 11వ వారం చివరి దశకి వచ్చేసింది. ఇప్పటికే 19 మందితో మొదలైన ఈ షో నుండి 10 మంది బయటకి వచ్చేశారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ కూడా బయటకి రావాల్సిన సమయం..

Bigg Boss 5: కాజల్, ఆనీ.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు?

Bigg Boss 5

Updated On : November 20, 2021 / 4:12 PM IST

Bigg Boss 5: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో 11వ వారం చివరి దశకి వచ్చేసింది. ఇప్పటికే 19 మందితో మొదలైన ఈ షో నుండి 10 మంది బయటకి వచ్చేశారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ కూడా బయటకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వారంలో ఒక్క రవి మినహా మిగతా అందరూ ఎలిమినేషన్ లో నామినేషన్ అయి ఉన్నారు. వీరిలో శ్రీరామ్, షణ్ముఖ్, సిరి, రవి, సన్నీ, మానస్ లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉండగా మిగతా ముగ్గురు డేంజర్ లో జోన్ లో ఉన్నారు.

Evaru Meelo Koteeswarulu: మహేష్ ఎపిసోడ్‌‌కి ముహూర్తం ఫిక్స్.. టీఆర్పీలు బద్దలే!

ఆర్జే కాజల్, ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ లలో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాజల్ గత వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే, గత వారం అనారోగ్య కారణాలతో జెస్సీ ఇంటి నుండి బయటకి వెళ్లడంతో ఎలిమినేషన్ గండం గట్టెక్కింది. కానీ.. ఈ వారం ఎలిమినేషన్ తప్పదు. కాగా.. కాజల్, ప్రియాంక, ఆనీలలో ఈ వారం ఒకరు ఇంటి నుండి బయటకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Tollywood Gossips: రూమర్స్‌ను నిజం చేస్తున్న మేకర్స్..!

ఈ ముగ్గురిలో కూడా ప్రియాంకా ఓటింగ్ లో ముందుండగా ఆనీ, కాజల్ మధ్యనే ఈ వారం ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తుంది. మొదటి నుంచీ కాజల్ పై షో ఫాలోవర్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కంటే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా ఉంది. ఆర్జేగా మంచి ఫాలోయింగ్ ఉండడం.. ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎస్టాబ్లిష్ అవడం ఇప్పటి వరకు కాజల్ కు కలిసొచ్చాయి. ఇక, ఆనీ మాస్టర్ అరుపులు, కేకలతో గత వారం నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అందుకే, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.