జయలలితగా కాజోల్, శశికళగా అమలాపాల్
జయలలిత బయోపిక్‌లో కాజోల్, అమలాపాల్..

జయలలిత బయోపిక్‌లో కాజోల్, అమలాపాల్..
చిత్రపరిశ్రమలో గతకొంత కాలంగా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. దివంగత తమిళనాడు మాజీముఖ్యంత్రి జయలలిత బయోపిక్‌కి కొద్దిరోజులుగా కోలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. జయలలిత బయోపిక్‌ని ప్రియదర్శిని, భారతీరాజా, రామ్ గోపాల్ వర్మ, కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, విజయ్ వంటి దర్శకులు వివిధ కోణాల్లో తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. ముందుగా దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ని కోలీవుడ్‌లో ‘తలైవి’ పేరుతోనూ, బాలీవుడ్‌లో ‘జయ’ పేరుతోనూ రూపొందించాలనుకున్నాడు. జయ పాత్ర కోసం టాలెంటెడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్‌ని సంప్రందించారు. అయితే ఆమె అడిగిన రెమ్యునరేషన్ దెబ్బకి భయపడి వెనక్కి తగ్గినట్టు వార్తలొచ్చాయి.
ఇదిలా ఉంటే, రీసెంట్‌గా కేతిరెడ్డి, బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజోల్‌ని జయలలిత క్యారెక్టర్ కోసం అడగగా, ఆమె ఓకే చెప్పిందట.. అలాగే జయ నెచ్చెలి శశికళ క్యారెక్టర్‌కిగానూ అమలాపాల్‌ని అప్రోచ్ కాగా, అమల శశికళ పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాలవారి సమాచారం. ఈ చిత్రానికి ‘శశిలలిత’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. మరోవైపు ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ జయలలితగా నటిస్తున్న సినిమాకి ‘ఐరన్ లేడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.