Kalki 2898 AD : ఇటలీ బీచ్‌లో కల్కి సాంగ్ షూట్.. ప్రభాస్, దిశా పటానితో రొమాంటిక్ సాంగ్..

ఇటలీ బీచ్‌లో 'కల్కి' మూవీ సాంగ్ షూట్. ప్రభాస్, దిశా పటానితో నాగ్ అశ్విన్ ఓ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట.

Kalki 2898 AD Movie shooting at italy with Prabhas Disha Patani

Kalki 2898 AD : ఈ సమ్మర్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్న ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898AD’. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. దీపికా పదుకోన్, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ అండ్ దిశా పటాని మధ్య ఓ డ్యూయెట్ సాంగ్ ఉందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో అందమైన సముద్రం ఒడ్డున కెమెరా కనిపిస్తుంది. ఈ ఫోటో ఇటలీలో జరుగుతున్న కల్కి మూవీ సెట్స్‌లోనిది అని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ అండ్ దిశా మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తునట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Also read : Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది.. టైటిల్ భలే ఉందండి ఆయ్..

ఇది ఇలా ఉంటే, ఈ నెల 8 నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి నిజంగానే 8వ తారీఖు నుంచి ప్రమోషన్స్ మొదలుపెడతారు లేదా చూడాలి. మే 9న ఈ సినిమాని తెలుగుతో పాటు ఇండియన్ పలు భాషలు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.

కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఓ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ మూవీలో రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా కొన్ని ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు