Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది.. టైటిల్ భలే ఉందండి ఆయ్..

ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ భలే ఉందండి ఆయ్.

Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది.. టైటిల్ భలే ఉందండి ఆయ్..

NTR brother in law Narne Nithiin next movie title announcement Video

Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్‌ హీరోగా పరిచయం అవుతూ ‘మ్యాడ్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న నితిన్.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’ అనే సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

ఇప్పుడు తాజాగా మరో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని బడా నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ రూపొందించబోతుంది. కొత్త దర్శకుడు అంజి కంచిపల్లి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి గోదావరి యాస్ లో ఎక్కువుగా ఉపయోగించే ‘ఆయ్’ అనే ఊతపదాన్ని టైటిల్ గా పెట్టారు. సబ్ టైటిల్ లో ‘మేం ఫ్రెండ్సండి’ అనే క్యాప్షన్ పెట్టారు. టైటిల్ వినడానికి చాలా ఎంటర్టైనింగా ఉంది.

Also read : Samantha : పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమంత.. వికలాంగుడితో ఫోటో దిగి.. వైరల్ అవుతున్న వీడియో..

కాగా ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయ్యినట్లు సమాచారం. ఇక టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో నిర్మాత బన్నీ వాసు.. ఈ సినిమాని ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫస్ట్ లుక్ ని ఈ గురువారం మార్చి 7న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ‘నయన్ సారిక’ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.

ఒక మంచి లవ్ ఎంటర్టైనర్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే చిన్న సినిమాలు అన్ని ఇటీవల మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రం పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.