‘ఇండియన్ 2’ లో కమల్ హాసన్ లుక్ చూశారా!
నవంబర్ 7 కమల్ 65వ పుట్టినరోజుతో పాటు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘ఇండియన్ 2’ నుండి ఆయన్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

నవంబర్ 7 కమల్ 65వ పుట్టినరోజుతో పాటు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘ఇండియన్ 2’ నుండి ఆయన్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
విశ్వనటుడు కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 7 కమల్ 65వ పుట్టినరోజుతో పాటు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘ఇండియన్ 2’ నుండి ఆయన్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..
కమల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకుడు శంకర్ ట్విట్టర్‌లో కమల్ సేనాపతి లుక్‌లో ఉన్న పిక్ షేర్ చేశారు. ఈ మూవీలో కమల్ 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నారు..
Read Also : ‘దర్బార్’ మోషన్ పోస్టర్ : ఆదిత్య అరుణాచలంగా ‘సూపర్‌స్టార్’
వెనక్కి తిరిగి నిలబడి కళ్ల ముందు అవినీతితో నిండిపోయిన ప్రపంచాన్ని తీక్షణంగా చూస్తున్నట్టుంది కమల్ లుక్.. సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియ భవానీ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది..
Happy birthday sir @ikamalhaasan pic.twitter.com/Gpx6LRc2DO
— Shankar Shanmugham (@shankarshanmugh) November 7, 2019