Kangana Ranaut : దసరా బరిలో కంగనా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో దూసుకొస్తున్న ‘తేజస్’.. టీజర్ రిలీజ్..
సర్వేశ్ మెవరా దర్శకత్వంలో కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తేజస్(Tejas) అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Kangana Ranaut Female Oriented Indian Air force Concept Movie Tejas will Releasing at Dasara Time
Kangana Ranaut : బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్ సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇటీవలే చంద్రముఖి 2 (Chandramukhi 2) సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించి పర్వాలేదనిపించింది కంగనా రనౌత్. త్వరలో మరిన్ని సినిమాలు లైన్లో పెట్టింది కంగనా. ఇప్పుడు దసరా(Dasara) బరిలో నిలవబోతుంది.
సర్వేశ్ మెవరా దర్శకత్వంలో కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తేజస్(Tejas) అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దేశభక్తి కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా తేజస్ సినిమా నుంచి టీజర్ రిలీజయింది. ఇక తేజస్ సినిమాని దసరా అయిన వెంటనే అక్టోబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Also Read : Shahrukh Khan : సొంత రికార్డునే బద్దలు కొట్టిన షారుఖ్.. పఠాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసిన జవాన్..
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. ఇక ఈ సినిమాకి వారం రోజులు ముందు దసరా బరిలో చాలా పెద్ద సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాలు ఉండగా బాలీవుడ్ లో గణపథ్ ఉంది. ఇవే కాకుండా పలు చిన్న సినిమాలు కూడా దసరా పండగకు అటు ఇటు రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్నాయి.