Kangana Ranaut : ‘మళ్లీ తిరిగి వచ్చెయ్ ప్లీజ్’.. అభిమాని మరణం.. కంగన భావోద్వేగం..
తన అభిమాని డాక్టర్ దీపా శర్మ మరణం పట్ల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంతాపం తెలిపారు..

Deepa Sharma
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగి పడడంతో మరణించిన తన అభిమాని డాక్టర్ దీపా శర్మ మరణం పట్ల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంతాపం తెలిపారు. దీపా ఇక లేరన్న వార్త తనను షాక్‌కి గురిచేసిందన్నారు. దీపాతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారామె.
‘‘జైపూర్‌లో ‘మణికర్ణిక’ షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను కలవడానికి చాలా మంది ఫ్యాన్స్ హోటల్ లాబీలో వెయిట్ చేస్తున్నారు. నేను గమనించలేదు. దీపా నన్ను చూసి పెద్దగా అరుస్తూ వచ్చి గట్టిగా హగ్ చేసుకుంది. తను నాకు సూపర్బ్ ఫ్యాన్.. నాకోసం స్వీట్స్, గిఫ్ట్స్ వంటివి పంపుతుండేది. బ్యూటిఫుల్ లెటర్స్ కూడా పంపేది. మనాలిలో నా ఇంటికి కూడా వచ్చింది. అలాంటి గొప్ప అభిమాని ఇక లేదు అనే మాట విని షాక్‌కి గురయ్యాను’’..

దీపా శర్మ మృతికి సంతాపం..
‘‘డాక్టర్ దీపా శర్మ ఆత్మకు సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతి.. మీరెప్పుడూ నా హృదయంలో ఉంటారు. మళ్లీ తిరిగి వచ్చెయ్ ప్లీజ్’’.. అంటూ తన అభిమాని మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు కంగన.
పర్వతాలు ప్రాణాంతకమైనవి..
‘‘ఈ రెయినీ సీజన్‌లో టూర్ల కోసం పర్వాతలకు వెళ్లడం మంచిది కాదు. ఈ వాతావరణంలో కొండచరియలు విరిగి పడుతుంటాయి. రోడ్ల నిర్మాణం కోసం కొండలు తవ్వడం, బాంబులతో పేల్చడం వల్ల బలహీనంగా మారడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. పర్వాతాలు అందం, ఆధ్యాత్మికమైనవే కాదు.. క్రూరమైన, ప్రాణంతకరమైనవి కూడా కావచ్చు’’.. అంటూ హెచ్చరించారు కంగనా రనౌత్.