Kangana Ranaut: ఆరేళ్లకే నన్ను అలా చేశారు – కంగనా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది....

Kangana Ranaut: ఆరేళ్లకే నన్ను అలా చేశారు – కంగనా షాకింగ్ కామెంట్స్!

Kangana Ranaut Reveals Shocking Incident Of Childhood

Updated On : April 25, 2022 / 4:23 PM IST

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. సమాజంలో జరిగే ప్రతి విషయంపై ఆమె స్పందిస్తూ వస్తోంది. అయితే తాజాగా ఆమె ‘లాక్ అప్’ అనే ఓ షోను హోస్ట్ చేస్తోంది. ఈ షోలోని కంటెస్టంట్స్‌కు సంబంధించిన సీక్రెట్స్ వారితోనే చెప్పిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా మునావ‌ర్ ఫ‌రూఖి అనే కంటెస్టంట్ తనకు చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.

kangana ranaut: అమితాబ్ లాంటి యాంగ్రీ యంగ్‌మ్యాన్ యశ్: కంగనా

చిన్నతనంలో తనకంటే పెద్దవాడైన ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గుర్తుకుచేసుకుని బాధపడ్డారు. అయితే ఈ క్రమంలోనే కంగనా కూడా తనకు జరిగిన షాకింగ్ ఘటనను గుర్తుకు చేసుకుంది. ఆమె ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఊరిలో తనకంటే పెద్దవాడైన ఓ వ్యక్తి తనను అభ్యంతరకరంగా తాకేవాడని.. కానీ ఆ సమయంలో అతడి ఉద్దేశ్యం ఏమిటో తనకు అర్థం కాలేదని కంగనా చెప్పుకొచ్చింది. తనతో పాటు మరికొందరు పిల్లల్ని పిలిచి, బట్టలు విప్పేయమని.. తమ ఒళ్లంతా తడిమేవాడంటూ చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కంగనా పంచుకుంది.

Kangana Ranaut: గ్లామర్ తడాఖా చూపిస్తున్న కాంట్రవర్సీ క్వీన్

ఇది విని అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. కంగనా లాంటి స్టార్ కూడా ఇలా లైంగిక వేధింపులకు గురయ్యిందని తెలుసుకుని వారు బాధపడ్డారు. అయితే సమాజంలో ఇలాంటి క్రూరమైన ఘటనలు ఇంకా జరుగుతున్నాయని.. వాటిని ధైర్యంగా ప్రజల ముందు పెట్టాలని.. మునావర్ ఇలా ఓ వేదికపై తనకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేయడం నిజంగా అభినందనీయం అని కంగనా చెప్పుకొచ్చింది. ఇక కంగనా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by ALTBalaji (@altbalaji)