Kangana Ranaut Covid : బాలీవుడ్ బ్యూటీ కంగనాకు కరోనా

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కరోనా (34) బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా చాలా నీరసంతో పాటు కళ్ల మంటలు ఉంటున్నాయి.

Kangana Ranaut Covid : బాలీవుడ్ బ్యూటీ కంగనాకు కరోనా

Kangana Ranaut Tests Positive For Covid 19

Updated On : May 8, 2021 / 12:14 PM IST

Kangana Ranaut Covid positive : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కరోనా (34) బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా చాలా నీరసంతో పాటు కళ్ల మంటలు ఉంటున్నాయి. అనుమానంతో కరోనా టెస్టు చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది’ అని కంగనా తెలిపారు. కళ్లు బాగా మంటగా ఉండటంతో చల్లటిప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాలని నిర్ణయించున్నట్టు తెలిపింది.

ఇలోగా తాను కరోనా టెస్టు చేయించుకోవడంతో ఈ రోజే టెస్టు రిజల్ట్స్ వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపింది. అలాగే తాను క్వారంటైన్ సమయంలో ధ్యానం చేస్తున్న ఫొటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. నాకు తెలిసిందిల్లా ఒక్కటే.. శరీరంలోని వైరస్‌ని ధైర్యంగా ఎదుర్కోవాలి. దయచేసి మీ మనోధైర్యాన్ని మరొకరి చేతిలో పెట్టొద్దు..

మీరు భయపడితే అది ఇంకా మిమ్మల్ని భయపెడుతుందని మరవొద్దు.. కొవిడ్‌-19 అనేది ఒకరకమైన జలుబు మాత్రమేనని గుర్తించండి.. చాలామందిలో మనోవేదనకు గురవుతున్నారు.. హరహర మహదేవ్ అంటూ ఇన్ స్టా పోస్టులో కంగనా రాసుకొచ్చింది.

Kangana