టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న కన్నడ కస్తూరిలు..

టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న కన్నడ కస్తూరిలు..

Kannada Heroiens: టాలీవుడ్‌లో నార్త్ బ్యూటీస్ గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంటే సౌత్‌ బ్యూటీస్ మాత్రం టాలెంట్‌తో వావ్ అనిపిస్తున్నారు. స్పెషల్లీ కన్నడ భామలు.. తెలుగు ఇండస్ట్రీని ఆల్ మోస్ట్ ఆక్యుపై చేసేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎవరు అంటే.. శాండల్ బ్యూటీ అనే చెప్తున్నారు. మరి తెలుగులో ఫుల్ ఫామ్‌లో ఉన్న కన్నడ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..

టాలీవుడ్‌ని ఆక్యుపై చేసేస్తున్నారు కన్నడ హీరోయిన్లు. ఒకప్పుడు నార్త్ హీరోయిన్లు హల్ చల్ చేస్తే.. ఇప్పుడు కన్నడ కస్తూరి లే హడావిడి చేస్తున్నారు. ప్రజెంట్ హాట్ టాపిక్ అయిన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాలో అందంతో పాటు అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసిన ఈముద్దుగుమ్మ.. నాని సినిమాలో ఛాన్స్‌తో పాటు మరికొన్ని సినిమాల ఆఫర్లతో బిజీ అయిపోయింది.

Krithi Shetty

తెలుగులో వరుసగా అవకాశాలు సంపాదించుకుంటున్న మరో కన్నడ బ్యూటీ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ కన్నడ చిన్నది.. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. ‘డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుని ప్రస్తుతం నితిన్ ‘అంధాదూన్’ రీమేక్‌లో నటిస్తోంది.

Nabha Natesh

ప్రస్తుతం తెలుగు తెరను ఏలుతున్న మరో కన్నడ భామ రష్మిక మందన్న. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ భామ ఫస్ట్ సినిమాలోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీతగోవిందం’ హిట్‌తో రష్మిక స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది. తర్వాత నితిన్, మహేష్, అల్లు అర్జున్.. ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది రష్మిక. ప్రజెంట్ బన్నీతో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది రష్మిక.

Rashmika Mandanna

ఇటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాప్ రేంజ్‌లో ఉన్న పూజా హెగ్డే రూట్స్ మాత్రం కర్ణాటకలోనే. ‘మహర్షి’ తో పాటు ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అకౌంట్‌లో వేసుకున్న పూజా.. ఇప్పుడు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాతో పాటు.. రామ్ చరణ్‌తో ‘ఆచార్య’ ఆడపాడనుంది.

 Pooja Hegde

ఆల్రెడీ సూపర్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నఈ కన్నడ హీరోయిన్స్‌తో పాటు.. రచితా రామ్ అనే మరో బ్యూటీ ‘సూపర్ మచ్చి’ సినిమాతో కొత్తగా ఎంట్రీ ఇస్తోంది. అలనాటి పెళ్లి సందడికి సీక్వెల్‌గా వస్తున్న ‘పెళ్లిసందడి’ సినిమాలో శ్రీలీల అనే మరో కన్నడ హీరోయిన్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ఇలా కన్నడ హీరోయిన్స్ తెలుగు స్క్రీన్‌ని ఫుల్‌గా ఆక్యుపై చేసేసుకుంటున్నారు.

Rachita Ram