Rajesh : కన్నడ ‘కళా తపస్వి’ కన్నుమూత.. విషాదంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుటుంబం

తాజాగా మరో ప్రముఖ నటుడు కన్నడ కళాతపస్వి రాజేశ్‌ కన్నుమూశారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణంతో ఇప్పటికి కన్నడ ప్రజలు ఇంకా తేరుకోలేదు. అంతలోనే ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు రాజేష్......

Rajesh : కన్నడ ‘కళా తపస్వి’ కన్నుమూత.. విషాదంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుటుంబం

Rajesh

Updated On : February 19, 2022 / 2:09 PM IST

Kannada Kalatapasvi :  ఇటీవల కరోనాతో లేదా వేరే ఆరోగ్య సమస్యలతో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణిస్తున్నారు. వారి మరణం సినీ పరిశ్రమకి తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. అన్ని సినీ పరిశ్రమలలోను పలువురు ప్రముఖులు ఇటీవల మృత్యువాత పడ్డారు. ఇటీవలే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణించారు. ఆమె మరణ వార్తని జీర్ణించుకోకముందే బాలీవుడ్ ఫేమస్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి, ప్రముఖ బెంగాలీ గాయని సంధ్య ముఖర్జీ మరణించారు. నిన్న ప్రముఖ మలయాళం కమెడియన్ ప్రదీప్ కూడా మరణించారు. ఇలా వరుస మరణ వార్తలు సినీ పరిశ్రమలని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 

తాజాగా మరో ప్రముఖ నటుడు కన్నడ కళాతపస్వి రాజేశ్‌ కన్నుమూశారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణంతో ఇప్పటికి కన్నడ ప్రజలు ఇంకా తేరుకోలేదు. అంతలోనే ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు రాజేష్ ఇవాళ ఉదయం మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా కెటిఆర్

కన్నడలో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఈయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం హాస్పిటల్ లో చేర్పించారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 19 తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాజేశ్‌ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కర్ణాటక విద్యారన్యపురలోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల పలువురు కన్నడ నటీనటులు, ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

Chiranjeevi : 24 గంటల్లో చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్

రాజేశ్‌ అసలు పేరు విద్యాసాగర్‌. ‘వీర సంకల్ప’ సినిమాతో 1964 లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని తన నటనతో మెప్పించిన ఆయన కన్నడ కళాతపస్వి బిరుదు అందుకున్నారు. మొదట్లో హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. 1991లో ఆయన చివరి సినిమా చేసి సినిమాలకి స్వస్తి చెప్పారు. 89 ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు కాగా వారిలో ఒకరైన ఆశారాణి యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా భార్య. దీంతో రాజేష్ మరణవార్త విని అర్జున్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.