Danger Boys : కన్నడ హిట్ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్..

కన్నడలో మంచి విజయంసాధించిన 'అపాయవీడి హెచ్చరిక' సినిమా తెలుగులో 'డేంజర్ బాయ్స్' పేరుతో రానుంది.

Danger Boys : కన్నడ హిట్ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్..

Kannada Movie Apaayavide Eccharike Releasing in Telugu Titled as Danger Boys

Updated On : June 2, 2025 / 7:48 PM IST

Danger Boys : కన్నడలో మంచి విజయంసాధించిన ‘అపాయవీడి హెచ్చరిక’ సినిమా తెలుగులో ‘డేంజర్ బాయ్స్’ పేరుతో రానుంది. కన్నడలో అభిజిత్ తీర్థహళ్లి దర్శకత్వంలో VG మంజునాథ్, పూర్ణిమ గౌడ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ సినిమాని దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా కన్నడ మూవీ టీమ్ అంతా హాజరయ్యారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ డేంజర్ బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, టీజర్ ను ప్రముఖ దర్శకనిర్మాత డాక్టర్ లయన్ సాయివెంకట్, పాటలను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ట్రైలర్ ను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ రిలీజ్ చేసారు.

Also Read : Tuk Tuk : ఓటీటీలో దూసుకుపోతున్న చిన్న సినిమా.. స్కూటర్ లో ఉండే ఆత్మ ఎవరిది?

ఈ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్న శ్రీరంగం సతీష్ కి మూవీ యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, దాన్ని ఏక కాలంలో కన్నడ – తెలుగులో తెరకెక్కిస్తామని మోవి ఏయూనిట్ ప్రకటించింది.