Rakshita Suresh: కారు ప్రమాదంలో గాయపడ్డ పొన్నియిన్ సెల్వన్-2 సింగర్.. ఇప్పుడెలా ఉందంటే..?
ప్రముఖ కన్నడ సింగర్ రక్షిత సురేష్ మలేషియాలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడింది. తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

Kannada Singer Rakshita Suresh Injured In Car Accident
Rakshita Suresh: ప్రముఖ కన్నడ నేపథ్య గాయని రక్షిత సురేష్ మలేషియాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో గాయపడింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 కన్నడ వర్షన్‌లో ఓ పాట పాడిన రక్షిత సురేష్ మంచి ఫేంను తెచ్చుకుంది. ఈ సింగర్ కన్నడలో పలు హిట్ సాంగ్స్‌ను పాడి అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె కారు ప్రమాదంలో గాయపడిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఆదివారం నాడు మలేషియా ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న రక్షిత సురేష్ కారు, అదుపుతప్పతి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందట. ప్రమాదం జరిగిన సమయంలో తన జీవితం మొత్తం కళ్ల ముందు రెండు క్షణాల్లో కనిపించిందని.. కారులో ఏర్పర్చిన ఎయిర్ బ్యాగ్స్ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని.. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన తీరుకు తాను ఇంకా వణికిపోతున్నానని.. కారు డ్రైవర్, ముందు సీటులో ఉన్న కో-ప్యాసెంజర్‌తో పాటు తనకు కూడా కొన్ని స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చింది.
రక్షిత సురేష్ కారు ప్రమాదం గురించి తెలుసుకుని, ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఉలిక్కి పడ్డారు. అయితే, ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయని ఆమె తెలియజేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.
View this post on Instagram