Kannappa : ప్ర‌భాస్ లుక్ లీక్‌.. స్పందించిన‌ క‌న్న‌ప్ప టీమ్‌.. ఆ ప‌ని చేస్తే రూ.5ల‌క్ష‌ల బ‌హుమానం..

మంచు విష్ణు ప్ర‌ధాన న‌టిస్తున్న మూవీ క‌న్న‌ప్ప‌.

Kannappa : ప్ర‌భాస్ లుక్ లీక్‌.. స్పందించిన‌ క‌న్న‌ప్ప టీమ్‌.. ఆ ప‌ని చేస్తే రూ.5ల‌క్ష‌ల బ‌హుమానం..

Kannappa team Respond on prabhas look leak

Updated On : November 9, 2024 / 1:28 PM IST

Kannappa : మంచు విష్ణు న‌టిస్తున్న మూవీ క‌న్న‌ప్ప‌. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌, మోహ‌న్ బాబుల‌తో పాటు ఎంద‌రో స్టార్స్ న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అయితే.. ఈ చిత్రం నుంచి ప్ర‌భాస్ లుక్ లీకైంది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఆ ఫోటోను లీక్ చేసిన వారిని క‌నిపెడితే.. రూ.5ల‌క్ష‌లు బ‌హుమానం ఇస్తామ‌ని తెలిపింది.

ఈ మేర‌కు ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది. ‘ ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు, మిగిలిన హీరోల ఫ్యాన్స్‌ను కోరుతున్న‌ది ఏమంటే.. కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ‘కన్నప్ప’ నుంచి ఓ ఫొటో అనధికారికంగా లీక్‌ అయినందుకు బాధపడుతున్నాం.

Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ అప్‌డేట్‌.. కౌంట్ డౌన్ స్టార్‌..

ఈ లీక్‌ మా కష్టాన్ని మాత్రమే కాదు.. ఈ ప్రాజెక్ట్‌ కోసం నిరంతరం కృషి చేస్తున్న 2 వేల మంది వీఎఫ్‌ఎక్స్‌ కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ ఫొటో లీక్ ఎలా జ‌రిగింది అనేది క‌నుగొనేందుకు మేము పోలీస్ కేసు పెట్టాము. దయచేసి ఈ ఫొటోను ఎవరూ షేర్‌ చేయొద్దని మనవి. దీన్ని షేర్‌ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫొటోను లీక్‌ చేసిన వ్యక్తిని కనిపెట్టినవారికి రూ.5 లక్షలు బహుమానం అందిస్తాం. మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. మీ మద్దతుకు ధన్యవాదాలు’ అని ఆ లేఖ‌లో ఉంది.