Kantara: టాలీవుడ్ రంగస్థలమే కన్నడ “కాంతారా”..

కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా "కాంతారా". తెలుగు థియేట్రికల్ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకోగా, ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు..

Kantara: టాలీవుడ్ రంగస్థలమే కన్నడ “కాంతారా”..

Kantara is the Sandalwood Rangasthalam

Updated On : October 17, 2022 / 12:15 PM IST

Kantara: కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా “కాంతారా”. ఈ సినిమా శాండల్‌వుడ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో.. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేస్తున్నారు. తెలుగు థియేట్రికల్ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకోగా, ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు.

Kantara : ‘కాంతారా’ తెలుగులో కూడా ఊహించని సెన్సేషన్.. ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్.. ఆశ్చర్యంలో టాలీవుడ్..

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు.. రాంచరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలానికి కొన్ని పోలికలు ఉండడం. ముఖ్యంగా అచ్యుత్ కుమార్ పాత్ర ప్రకాష్ రాజ్ పాత్రను పోలి ఉంటుంది. అలాగే హీరో సోదరుడు గ్రామ పెద్ద చేతిలో చంపబడడం, దాని చుట్టూ అల్లుకున్న ప్రతీకారం కథనం. కాకపోతే ఈ రెండు సినిమాలను వేరు చేసేది కాంతారా లోని ‘గ్రామీణ దేవుడు’ అనే ఒక్క విషయం.

నిజానికి, రంగస్థలం ట్విస్ట్‌లతో కూడిన మంచి స్క్రీన్‌ప్లే ఉన్న సినిమా. అలాని కాంతారా కాపీ సినిమా అనడం లేదు. దీనిని శాండల్‌వుడ్ రంగస్థలంగా పేర్కొనవచ్చు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ నేరేషన్ మరియు దాని నేపథ్యం సినిమాని ఆకట్టుకునేలా చేశాయి. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు ప్రశంసలు అందుకుంటుంది.