Kapata Nataka Sutradhari : ఆహాలో మరో సరికొత్త సినిమా.. బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ తో ‘కపట నాటక సూత్రధారి’..

తెలుగు ఓటీటీ ఆహాలో రోజు రోజుకి సరికొత్త షోలు, సినిమాలు తీసుకొస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక పక్క షోలు, ఒక పక్క సిరీస్ లు, మరో పక్క సినిమాలతో ఆహా ఓటీటీ దూసుకెళ్ళిపోతోంది. తాజాగా ఈ వారం................

Kapata Nataka Sutradhari : ఆహాలో మరో సరికొత్త సినిమా.. బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ తో ‘కపట నాటక సూత్రధారి’..

Kapata Nataka Sutradhari movie streaming in AHA

Updated On : October 23, 2022 / 7:02 AM IST

Kapata Nataka Sutradhari :  తెలుగు ఓటీటీ ఆహాలో రోజు రోజుకి సరికొత్త షోలు, సినిమాలు తీసుకొస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక పక్క షోలు, ఒక పక్క సిరీస్ లు, మరో పక్క సినిమాలతో ఆహా ఓటీటీ దూసుకెళ్ళిపోతోంది. తాజాగా ఈ వారం మరో సినిమా ఆహా లిస్ట్ లో చేరింది. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో రిలీజ్ అయినా కపట నాటక సూత్రధారి సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.

సినిమాలో సత్తా ఉంటే, కంటెంట్ కొత్తగా ఉంటే, థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌ కంటే కొత్తదనం ఉన్న సినిమాలను జనాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా ఓ బ్యాంక్ దొంగతనం చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన కపట నాటక సూత్రధారి సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కపట నాటక సూత్రధారి’ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఆహాలోకి రాగా మంచి స్పందనను దక్కించుకుంటోంది.

BiggBoss 6 Day 48 : హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?.. మెరీనాని అన్యాయం చేసేశారుగా..

నటీనటుల అద్భుతమైన పర్ఫామెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కడం, క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టేలా కథనం ఉండటం వంటి అంశాలతో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది. క్రాంతి సైన దర్శకత్వం వహించిన ఈ సినిమా కి మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరించారు.