Kapil Sharma Talk Show : 33 ఏళ్ల తర్వాత సీత, రామ, లక్ష్మణ

దాదాపు 33 ఏళ్ల క్రితం బుల్లితెరపై దూరదర్శన్‌లో ప్రసారమయి..ఎంతో మంది ప్రేక్షకులను మనస్సులను దోచుకున్న సీరియల్స్‌లో రామాయణం ఒకటి. రామానంద్ దర్వకత్వంలో ప్రసారమయిన..ఈ సిరీస్‌కు గొప్ప ఆదరణ లభించింది. మాధ్యమాలు తక్కువగా ఉన్న ఆ కాలంలో రామాయణం సీరియల్ వస్తుందంటే.,.చాలు ఇంటిల్లిపాది టీవీకి అతుక్కపోయే వారు. రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన అరుణ్ గోవిల్, దీపిక చిఖలియా, సునీల్ లాహిరిలు కపిల్ శర్మ టాక్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను షో నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
రామాయణం కోసం భారీ కాస్ట్యూమ్స్ ధరించడం, అలాగే తలపై కిరీటం పెట్టుకోవడం వల్ల దురదగా అనిపించలేదా అని కపిల్ అరుణ్ (రాముడి పాత్ర)ను ప్రశ్నించారు. కాస్ట్యూమ్స్ ధరిస్తేనే కాదు..ఒక్కోసారి వాటిని చూస్తేనే దురదగా అనిపించేంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక రాధిక (సీత పాత్ర) మాట్లాడుతూ..తనకు సీత పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చిందని, చాలా మంది చేతులు జోడించి నమస్కారం పెడుతారన్నారు. సాక్రేడ్ గేమ్స్‌లోని నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫేమస్ డైలాగ్ కపిల్ వినిపించారు. మేమే దేవుళ్లం అని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా ? అంటూ కపిల్ ముగ్గురిని అడిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ షో 2020, మార్చి 07వ తేదీ శనివారం ప్రసారం కానుంది.
See Also | రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే బంధువులు, కారణం ఇదే