Karan Johar : తప్పు చేసేదే వీళ్ళు.. మళ్ళీ తప్పని సూక్తులు చెప్తున్న బాలీవుడ్ నిర్మాత..
తాజాగా నిర్మాత కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూ లో ఈ కార్పొరేట్ బుకింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Karan Johar)

Karan Johar
Karan Johar : తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో కార్పొరేట్ బుకింగ్స్ అని ఒక పద్ధతి ఉంది. ఏదైనా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉంటే, సినిమాకు కావాల్సినంత హైప్ లేకపోతే నిర్మాతలే కొన్ని థియేటర్స్ లో టికెట్స్ బ్లాక్ చేయడం, కొన్ని టికెట్స్ కొనడం, తమ వాళ్ళను పంపి సినిమా హాల్ దగ్గర హడావిడి చేయడం చేస్తూ ఉంటారు.(Karan Johar)
దాంతో ఆన్లైన్ లో ఆ సినిమాకు బుకింగ్స్ బాగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది చూసి ఈ సినిమా బాగుందనుకొని అని జనాలు వస్తారని భావిస్తారు. బాలీవుడ్ లో చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు ఈ కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతాయి. టాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే ఈ పద్ధతి ఎంటర్ అవుతుంది. గతంలో సలార్ – డంకి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాలీవుడ్ లో కార్పొరేట్ బుకింగ్స్ తో డంకి సినిమాకు బ్లాక్ చేసి సలార్ కి థియేటర్స్ ఇవ్వలేదని వివాదమే నడిచింది.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నే వెయిట్ చేయించిన సినిమాటోగ్రాఫర్.. ఆయన టైం ఇవ్వడమే గగనం అంటే..
అయితే తాజాగా నిర్మాత కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూ లో ఈ కార్పొరేట్ బుకింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ కార్పొరేట్ బుకింగ్స్ చాలా మంది నిర్మాతలు చేస్తున్నారు. వాళ్ళు తమ సొంత డబ్బు ఖర్చు చేసి టికెట్స్ కొనడం ద్వారా సినీ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు. ఈ కార్పొరేట్ బుకింగ్స్ సినిమాలను కూడా దెబ్బ తీస్తాయి. ఇలాంటి అనైతిక పద్దతుల ద్వారా సినిమాని దెబ్బ తీస్తున్నారు. ఈ కార్పొరేట్ బుకింగ్స్ మహా అయితే ఓపెనింగ్స్ కి, మొదటి రెండు రోజులు పనికొస్తుందేమో కానీ లాంగ్ రన్ లో ఇది పనికి రాదు. కార్పొరేట్ బుకింగ్స్, సెల్ఫ్ బుకింగ్స్ తో సినిమాల కలెక్షన్స్ ని పెంచి చూపించడానికి ఉపయోగపడతాయి కానీ అది ప్రేక్షకులను మోసం చేయడమే. సినిమా జనాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా బాగుంటే జనాలు వెళ్తారు లేకపోతే లేదు అని అన్నారు.
Also Read : Ravi K Chandran : ఓజీ రిలీజ్ తర్వాత అకిరా నందన్ నాకు ఫోన్ చేసి.. ఓజీ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్..
దీంతో కరణ్ జోహార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాలకు కూడా గతంలో కార్పొరేట్ బుకింగ్స్ చేసారని ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ లోనే ఎక్కువ కార్పొరేట్ బుకింగ్స్ చేసేది. అలాంటిది ఇప్పుడు కరణ్ జోహార్ ఈ కార్పొరేట్ బుకింగ్స్ మీద మాట్లాడటం విడ్డురంగా ఉందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.