పృథ్వీకి కరాటే కళ్యాణి కౌంటర్: వెంకన్నతో పెట్టుకుంటే అంతే!

  • Published By: vamsi ,Published On : January 13, 2020 / 07:26 AM IST
పృథ్వీకి కరాటే కళ్యాణి కౌంటర్: వెంకన్నతో పెట్టుకుంటే అంతే!

Updated On : January 13, 2020 / 7:26 AM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి కరాటే కళ్యాణి. రవితేజ హీరోగా చేసిన కృష్ణ, మిరపకాయ్ లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్‌గా ఉన్నారు. లేటెస్ట్‌గా యాక్టర్ పృథ్వీ రాసలీలల వ్యవహారం సంచలనం అవగా.. ఆమె ఆయనపై గట్టి వ్యాఖ్యలు చేశారు. పృథ్వీరాజ్ కూడా ‘మా’ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పృథ్వీకి కరాటే కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. పృథ్వీరాజ్ ఆడియో టేప్ వ్యవహారం బయటపడగా.. శ్రీవారి సమక్షంలో ఇటువంటి పనులకు పాల్పడటం కరెక్ట్ కాదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారితో పెట్టుకుంటే ఇలాగే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ పదవి వస్తుందని అటువంటిది తప్పుడు పని చేశారని అన్నారు. 

రాఘవేంద్రరావు గారి తర్వాత ఆ పదవి పృథ్వీకి వచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకుంటే వచ్చి ఉంటుంది. అలాంటి పదవిలో ఉన్నప్పుడు స్వామివారిపైనే మచ్చతెచ్చే పనులు చెయ్యడం కరెక్ట్ కాదని అన్నారు. నేను శ్రీవారి భక్తురాలిని, అందుకే ఈ వివాదం నన్ను చాలా బాధించిందని అన్నారు. ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అని అన్నారు కళ్యాణి. పృథ్వీ నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఇవన్నీ జరగకపోయేవి. మొదటి నుంచి ఆయన నోరు అదుపులో పెట్టుకోలేదు అని అన్నారు. 

ఇక తన వాయిస్‌ను మిమిక్రీ చేశారని పృథ్వీ అంటున్నారని, ఒకవేళ అదే నిజమైతే ఏ నెంబర్ నుంచైతే ఫోన్ వచ్చిందో ఆ నెంబర్‌ను, తన ఫోన్ నెంబర్‌ను మీడియా ముందు బయటపెట్టచ్చు కదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిసిపోతుంది కదా? అని అన్నారు. మరో విషయం ఏంటంటే.. ‘మా’ అసోసియేషన్‌లో పృధ్వీ కూడా సభ్యుడే.

ఇటీవల పృధ్వీ ‘మా’ గురించి మాట్లాడుతూ.. ‘అబ్బబ్బ ఈ ‘మా’తో పెద్ద రచ్చైపోతోంది ఇండస్ట్రీలో. ఇందుకోసం అనవసరంగా తిరుపతి నుంచి వచ్చాను. అంటూ ఏవేవో మాట్లాడరని, ఆ మాట విని నాకు చాలా కోపం వచ్చిందన్నారు. ‘మా’లో విభేదాలు ఉన్నాయని మీడియాకు తెలియాలని వారిలో ఏం జరిగింది అన్న ఆత్రుత కలిగించేలా పృథ్వీ మాట్లాడారని అన్నారు.

వెంకటేశ్వర స్వామి సేవకుడిగా వెళ్లి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వెంటనే శ్రీవారే శిక్ష విధించేస్తారని వెంకన్నతో పెట్టుకుంటే శిక్ష వెంటనే పడుతుందనే అభిప్రాయం ఉందని ఇప్పుడు ఇది నిరూపితం అయ్యిందని అన్నారు.