Karthi : స్టేజిపై పాట పాడిన కార్తీ.. తెలుగు పాత పాట ఎంత బాగా పాడాడో చూడండి..
ఈవెంట్ లో స్టేజిపై హీరో కార్తీ మన తెలుగు పాత పాట పాడి వినిపించారు.

Karthi Sing a Old Telugu Song on Stage at Sathyam Sundaram Movie Pre Release Event
Karthi : తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా తెలుగులో సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో స్టేజిపై హీరో కార్తీ మన తెలుగు పాత పాట పాడి వినిపించారు. యాంకర్ ఓ పాట పాడమని అడగ్గా ఈ సినిమా 90s సినిమాలా ఉంటుంది కాబట్టి పాత పాట పాడతాను అని పాడారు.
కార్తీ పాత సినిమా ‘అభినందన’లోని అదే నీవు.. అదే నేను.. అదే గీతం.. అంటూ సాగే పాటని ఓ రెండు లైన్స్ చక్కగా పాడారు. దీంతో కార్తీ సాంగ్ పాడిన పాట వైరల్ గా మారింది. కార్తీ తెలుగులో ఎంత బాగా పాడారో అని అనుకుంటున్నారు. మీరు కూడా కార్తీ పాడిన వీడియో చూసేయండి..
View this post on Instagram
కార్తీ గతంలో సింగర్ గా కూడా తమిళ్ లో పలు పాటలు పాడారు. తెలుగులో కూడా శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాలో ఒక సాంగ్, తన జపాన్ సినిమాలో ఒక సాంగ్ పాడారు. ఇప్పుడు ఇలా స్టేజిపై పాడి ఫ్యాన్స్ ని మరోసారి అలరించారు.