Viruman : కార్తి ఊరమాస్ ‘విరుమాన్’..
వెర్సటైల్ యాక్టర్ సూర్య తన సొంత ప్రొడక్షన్‌లో తమ్ముడు కార్తితో ‘విరుమాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు..

Viruman
Viruman: డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. సినిమా సినిమాకి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ.. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ, తనకంటూ సొంతగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు వెర్సటైల్ యాక్టర్ సూర్య.
Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..
హీరోగా ఎంత బిజీగా ఉన్నా తన సొంత ప్రొడక్షన్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద మంచి సినిమాలు నిర్మిస్తూ అభిరుచిగల నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. అన్నలానే తమ్ముడు కార్తి కూడా తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఆదరణ దక్కించుకున్నారు.
ఇప్పుడు సూర్య సొంత ప్రొడక్షన్‌లో తమ్ముడితో ఓ డిఫరెంట్ సినిమా తీస్తున్నారు. ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు ‘విరుమాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కార్తి ఊరమాస్ గెటప్‌లో ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
#Viruman First Look! @Suriya_offl @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian #RajKiran pic.twitter.com/Sz1SAVSavB
— Actor Karthi (@Karthi_Offl) January 14, 2022