అభిమానికి వంటలక్క సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Karthika Deepam Actress Surprise gift:‘కార్తీకదీపం’ ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్(వంటలక్క)ను ఒక అభిమాని ట్వీట్ బాగా ఆకట్టుకుంది. ఆ అభిమాని తననేమీ కోరకపోయినా.. తన సీరియల్ విషయమై చేసిన రిక్వెస్ట్‌కు ఆమె ఫిదా అయ్యారు. కార్తీక దీపం సీరియల్ ప్రసారమవుతున్న సమయంలోనే.. ఐపీఎల్ ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన శివ చరణ్.. తమ కుటుంబం సీరియల్‌ను మిస్ అవుతుందని.. లేదంటే తాను ఐపీఎల్‌ను మిస్ అవ్వాల్సి వస్తుందని.. తమ ఇంట్లో మరో టీవీ కూడా లేదని.. కాబట్టి ఐపీఎల్ సమయాన్ని మార్చాలంటూ గంగూలీ, స్టార్ మా, చెన్నై ఐపీఎల్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు..
విషయం తెలుసుకున్న ప్రేమీ.. శివచరణ్‌కు ఒక లేఖ రాయడమే కాకుండా ఊహించని గిఫ్ట్ పంపించింది. ‘‘మీ అభిమానానికి మాటలు రావడం లేదు. ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి మీరు ట్విట్టర్‌లో చెప్పిన సమస్యకు పరిష్కారంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కానుక పంపుతున్నాను. మీ ఇంట్లో ‘కార్తీక దీపం’ ఇక వెలుగుతూనే ఉంటుంది.
మీ అభిమానం మా పట్ల ఇలాగే ఉండాలని కోరుతున్నాను. మాస్క్ లేకుండా బయటకు వెళ్లకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి’’ అని లెటర్‌లో పేర్కొంది. దాంతో పాటు 32 ఇంచెస్ టీవీని గిఫ్ట్‌గా పంపించింది ప్రేమీ విశ్వనాథ్.. తమ అభిమాన నటి నుండి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ రావడంతో శివ చరణ్ కుటుంబం తెగ సంబరపడిపోయింది.