Karthika Missing Case : సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా ‘కార్తిక-మిస్సింగ్ కేస్’.. తెలుగు ఓటీటీలో..

నేడు ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ తమిళ్ డబ్బింగ్ సినిమా అందుబాటులోకి వచ్చింది.

Karthika Missing Case : సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా ‘కార్తిక-మిస్సింగ్ కేస్’.. తెలుగు ఓటీటీలో..

Karthika Missing Case Tamil Super Hit Movie Dubbed in Telugu Streaming Details

Updated On : June 13, 2025 / 2:52 PM IST

Karthika Missing Case : రెగ్యులర్ గా ఆహా ఓటీటీ కొత్త సినిమాలు, కొత్త షోలతో సందడి చేస్తుంది. అంతే కాకుండా తమిళ్, మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి ప్రతివారం ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నేడు ఆహా ఓటీటీలో మరో సూపర్ హిట్ తమిళ్ డబ్బింగ్ సినిమా అందుబాటులోకి వచ్చింది.

కథిర్, నరేన్, ఆనంది, పవిత్ర లక్ష్మి.. పలువురు కీలక పాత్రల్లో జాక్ హారిస్ దర్శకత్వంలో 2022లో తెరకెక్కిన తమిళ్ సినిమా యుగి. ఇదే మలయాళంలో ‘అదృశ్యం’గా రిలీజయింది. ఒక అమ్మాయి మిస్ అయి మర్డర్ అయ్యే కథతో థ్రిల్లింగ్ గా సాగుతుంది ఈ సినిమా. తెలుగులో ఈ సినిమా ‘కార్తిక-మిస్సింగ్ కేస్’ అనే టైటిల్ తో రిలీజయింది.

Also Read : The Raja Saab : ప్ర‌భాస్ ‘ది రాజాసాబ్’ టీజ‌ర్ లీక్‌..! నెటిజ‌న్‌ల‌కు చిత్ర‌బృందం హెచ్చ‌రిక‌..

తెలుగులో ఆహా ఓటీటీలో నేటి నుంచి ఈ కార్తిక-మిస్సింగ్ కేస్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో భవాని మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మీరు కూడా ఆహా ఓటీటీలో చూసేయండి.