Katrina Kaif : మమ్మల్ని విధి కలిపింది.. మా కలయికకి ఏదో బలమైన కారణం ఉంది..
కత్రినా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ''జోయా అక్తర్ ఇచ్చిన ఓ పార్టీలో మొదటిసారి అతన్ని చూశాను. మొదటి సారే అతని మాటల్లోని స్వచ్ఛత, అతనిలోని అమాయకత్వం నాకు నచ్చింది. మొదటి పరిచయంలోనే మేమిద్దరం బాగా..........

Katrina Kaif Share her love story in Koffee with Karan Show
Katrina Kaif : బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ ఇటీవల కొన్ని నెలల క్రితం తనకంటే చిన్నవాడైన యువ హీరో విక్కీకౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో ఎవర్ని పిలవకుండా చాలా సైలెంట్ గా అతితక్కువ మంది మధ్యలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాజాగా కత్రినా కైఫ్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొంది. కరణ్ జోహార్ తన లవ్ స్టోరీని చెప్పమని కత్రినాని అడిగటంతో కత్రినా విక్కీతో తన లవ్ స్టోరీని చెప్పింది.
కత్రినా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ”జోయా అక్తర్ ఇచ్చిన ఓ పార్టీలో మొదటిసారి అతన్ని చూశాను. మొదటి సారే అతని మాటల్లోని స్వచ్ఛత, అతనిలోని అమాయకత్వం నాకు నచ్చింది. మొదటి పరిచయంలోనే మేమిద్దరం బాగా మాట్లాడుకున్నాం. అప్పుడే విక్కీ నా హృదయానికి బాగా దగ్గరివాడు అనిపించింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎన్నో యాదృచ్ఛిక సంఘటనలు జరిగాయి. కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగాయి. మా ఇద్దరి మధ్య కో ఇన్సిడెన్స్ గా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇవన్నీ ఏదో బలమైన కారణంతోనే జరిగాయని, విధి మా ఇద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తుందని అర్ధం చేసుకున్నాను. దీంతో కొంతకాలం డేటింగ్ చేశాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లిచేసుకున్నాం” అని తెలిపింది.
Vijayendraprasad : టాలీవుడ్ హబ్ ని ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీని తీసుకొస్తాను..
దీంతో కత్రినా చెప్పినా మాటలు విని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. విధి కలిపింది, మా ఇద్దరి మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి అని కత్రినా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.