PaPa Trailer : తమిళ సూపర్ హిట్ మూవీ ‘దాదా’.. తెలుగు డబ్బింగ్‌తో వచ్చేస్తుంది..
తమిళ సూపర్ హిట్ మూవీ 'దాదా'.. 'పాపా' అంటూ తెలుగు డబ్బింగ్‌తో వచ్చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

Kavin Aparna Das DaDa movie dubbed as papa in telugu trailer
PaPa Trailer : గత ఏడాది తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘దాదా’. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఈ తమిళ్ హిట్ మూవీని కొంతమంది తెలుగు ఆడియన్స్ సబ్ టైటిల్స్ సహాయంతో ఆల్రెడీ చూసేసారు.
ఇటీవల నాని ‘హాయ్ నాన్న’ రిలీజ్ సమయంలో ఈ మూవీ గురించి టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. హాయ్ నాన్న పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్ చూసిన ఆడియన్స్.. హాయ్ నాన్న మూవీ ‘దాదా’ చిత్రానికి రీమేక్ గా రాబోతుందని అనుకున్నారు. కానీ రిలీజ్ తరువాత హాయ్ నాన్నకి, దాదాకి ఫాదర్ సెంటిమెంట్ తప్ప మరో కనెక్షన్ లేదని తేలిపోయింది. కాగా హాయ్ నాన్న సూపర్ హిట్ అవ్వగా, దాదా మూవీకి కూడా ఇక్కడ కొంచెం ఫ్రీ పబ్లిసిటీ అయ్యింది.
Also read : Gaami Review : ‘గామి’ సినిమా రివ్యూ.. అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రం..
ఈ పబ్లిసిటీతో చాలామంది ఆడియన్స్ ఆ తమిళ మూవీని చూసేందుకు ప్రయత్నం చేసారు. అయితే వారందరికీ భాష అడ్డంకిగా నిలిచింది. ఇక ఆడియన్స్ లో ఈ మూవీ పై ఆసక్తి గమనించిన టాలీవుడ్ మేకర్స్.. ఇప్పుడు దానిని ‘పాపా’ పేరుతో తెలుగు డబ్బింగ్ చేసి తీసుకు వస్తున్నారు. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఎంఎస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.
తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ని టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన లాంచ్ చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. మరి తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.