Chiranjeevi : తల్లి హీరోయిన్ గా.. కూతురు చెల్లిగా.. చిరంజీవి సరసన..

హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్.

Chiranjeevi : తల్లి హీరోయిన్ గా.. కూతురు చెల్లిగా.. చిరంజీవి సరసన..

Keerthi suresh as sister for Chiranjeevi in past keerthy Mother Menaka acted as Heroine for Chiranjeevi

Chiranjeevi : మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్(Bholaa Shankar) సినిమా ఆగస్టు 11న రాబోతుంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా(Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. సుశాంత్(Sushanth) ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా కీర్తి సురేష్ ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మేనక 1980లో వచ్చిన చిరంజీవి పున్నమినాగు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మేనక కూతురు కీర్తి చిరంజీవి చెల్లెలిగా నటించడం విశేషం. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ దీనిపై స్పందించింది.

Mahesh Babu Family : మొన్నటిదాకా లండన్.. ఇప్పుడు స్కాట్లాండ్.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు..

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో అమ్మ పున్నమినాగు చిత్రంలో నటించారు. అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, అలాగే సెట్ లో ఇచ్చిన సలహాలు సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్ గా చూసుకునేవారట. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు చిరంజీవి రియాక్షన్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. ‘’మీ అమ్మగారు ఇంతే చెప్పిందా.. నేను తనతో ఇంకా చాలా చెప్పాను’ అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకి గుర్తుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్మార్ట్ నువ్వు అని చిరంజీవి గారు అన్నారు అంటూ తెలిపింది. ఏదేమైనా ఒక హీరో పక్కన తల్లేమో హీరోయిన్ గా ఒకప్పుడు, కూతురు ఏమో చెల్లిగా ఇప్పుడు నటించడం విశేషమని చెప్పాలి.