Keerthy Suresh: టాలీవుడ్‌లో కీర్తి జోరు.. మరో సినిమాకి సైన్?

టాలీవుడ్ కీర్తి సురేష్ హవా కొనసాగిస్తుంది. మహానటి సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న కీర్తి ఆ తర్వాత ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల జతకట్టి వరస సినిమాలను..

Keerthy Suresh: టాలీవుడ్‌లో కీర్తి జోరు.. మరో సినిమాకి సైన్?

Keerthy Suresh

Updated On : March 24, 2022 / 2:46 PM IST

Keerthy Suresh: టాలీవుడ్ కీర్తి సురేష్ హవా కొనసాగిస్తుంది. మహానటి సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న కీర్తి ఆ తర్వాత ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల జతకట్టి వరస సినిమాలను లైన్ లో పెడుతుంది. మహానటి తర్వాత కీర్తి చేసిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఇప్పుడు వరసగా స్టార్ హీరోల సినిమాలను పెట్టేస్తూ జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాటలో నటిస్తుండగా.. నేచురల్ స్టార్ నానీ దసరాలో కూడా కీర్తినే హీరోయిన్.

Keerthy Suresh: ట్రెడిషనల్‌గా మైమరిపిస్తున్న కీర్తి!

ఇవి కాకుండా తమిళం, మలయాళంలో కూడా మూడు సినిమాలు చేస్తున్న కీర్తి తెలుగులో మరో సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో తెలుగు ప్రేక్షుకుల ముందుకొచ్చిన శర్వానంద్ ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం అందకపోయినా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. డ్రీ వారియర్ బ్యానర్ లో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఒకే ఒక జీవితం అనే సినిమాతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ లో మరో సినిమా కూడా పట్టాలెక్కించనున్నాడు. కృతిశెట్టి ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టించ‌నుంది.

Keerthy Suresh : ఎమ్మెల్యే పక్కన హీరోయిన్ గా చేయబోతున్న కీర్తి సురేష్

ఇవి రెండు కాకుండా ఇప్పుడు ఓ స్టార్ ప్రొడ్యూసర్ శర్వానంద్.. కీర్తి సురేష్ పెయిర్ గా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇందు కోసం ఇప్పటికే ఓ కథను వినిపించగా హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ సినిమాకి దర్శకుడెవరు.. శర్వా-కీర్తిలకు కథ చెప్పిన ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరన్నది త్వరలోనే తెలియనుంది.