Miss India అంటే ఒక బ్రాండ్ అంటున్న కీర్తి సురేష్..

Keerthy Suresh-Miss India: నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగానే కాకుండా కథా బలమున్న మహిళా ప్రాధాన్యత గల సినిమాలు చేస్తూ.. మంచి నటిగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇటీవల ‘పెంగ్విన్’ చిత్రంతో ఆకట్టుకున్న కీర్తి సురేష్ మరోసారి ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘మిస్ ఇండియా’.. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మించి ఈ సినిమా ట్రైలర్ శనివారం రిలీజ్ చేశారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, బిజినెస్ వుమెన్‌గా ఎదగాలనుకునే అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ఆమె ధైర్యంగా ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సంయుక్త పాత్రలో కీర్తి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
https://10tv.in/good-luck-sakhi-keerthy-suresh-birthday-special-video/
జగపతిబాబు విలన్ తరహా పాత్రలో కనిపిస్తున్నారు. నదియా, నరేష్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో నటించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ‘మిస్ ఇండియా’ స్ట్రీమింగ్ కానుంది.