Yash19 : హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌తో యశ్.. త్వరలో గుడ్ న్యూస్.. పిక్ వైరల్..
Yash19 సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ దగ్గర యశ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. ఈ మూవీ డైరెక్టర్..

KGF hero Yash pic with hollywood stunt master JJ Perry for Yash19
Yash19 : కన్నడ హీరో ‘యశ్’ కేజీఎఫ్ (KGF) సినిమాలతో ఇండియా వైడ్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది. కానీ యశ్ మాత్రం ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కేజీఎఫ్ 2 వచ్చి ఏడాది దాటిపోయింది. దీంతో రాకీ భాయ్ అభిమానులంతా తదుపరి సినిమా ఎప్పుడంటూ గత కొంత కాలంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీనికి యశ్ కూడా బదులిస్తూ.. ‘ఎదురు చూస్తూ ఉండండి. క్రేజీ అప్డేట్ ఇస్తాను’ అంటూ చెప్పుకొస్తున్నాడు.
Maama Mascheendra Trailer : సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..
తాజాగా ఈ హీరో ఒక హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తో కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోని ఆ స్టంట్ డైరెక్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘విత్ మై బ్రదర్’ అంటూ పోస్ట్ వేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టంట్ మాస్టర్ ఎవరంటే.. అవతార్, ఐరన్ మ్యాన్, జాన్ విక్ వంటి బ్లాక్ బస్టర్ మూవీలకి పని చేసిన ‘జేజేపెర్రీ’ (J. J. Perry). ఇతను దగ్గర యశ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక యశ్ 19వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకుంది.
Ram Gopal Varma : ఓ అమ్మాయి కోసం వర్మ ఆరాటం.. పేరు చెప్పాలంటూ ట్వీట్.. వైరల్
View this post on Instagram
మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతోందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. దర్శకురాలిగా మారి ఇప్పటివరకు మూడు సినిమాలు చేసింది. ఇప్పుడు Yash19 ని గీతూ మోహన్ దాసే డైరెక్ట్ చేయబోతోందని తెలుస్తుంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతుందని సమాచారం. డిసెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ కి వెళ్లనుందని, అక్టోబర్ లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక అప్డేట్ రానుందని తెలుస్తుంది.