Yash : నా పుట్టిన రోజు మీద నాకు అసహ్యం వేస్తుంది.. అభిమానుల మృతితో యశ్ సంచలన వ్యాఖ్యలు..

యశ్ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధం చేస్తుండగా ముగ్గురు యువకులు కరెంట్ షాక్ తగిలి మరణించడంతో విషాదం నెలకొంది.

Yash : నా పుట్టిన రోజు మీద నాకు అసహ్యం వేస్తుంది.. అభిమానుల మృతితో యశ్ సంచలన వ్యాఖ్యలు..

KGF Yash meets Grieving Families of his fans who passed away on his birthday with current shock

Yash : నిన్న జనవరి 8 కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టిన రోజు. KGF సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యశ్. నిన్న యశ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. యశ్ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధం చేస్తుండగా ముగ్గురు యువకులు కరెంట్ షాక్ తగిలి మరణించడంతో విషాదం నెలకొంది.

కర్ణాటక గడగ్ జిల్లాలోని సురంగి గ్రామంలో యశ్ అభిమానులైన ముగ్గురు యువకులు నిన్న యశ్ పుట్టిన రోజుకి బ్యానర్స్ కడుతుండగా పక్కనే ఉన్న పవర్ లైన్ నుంచి హై వోల్టేజ్ షాక్ కొట్టడంతో ఆ యువకులు అక్కడికక్కడే పడిపోయారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని హనుమంత్(24), మురళి(20), నవీన్(20).. అనే ముగ్గురు యువకులు ఈ ఘటనలో మరణించినట్లు తెలిపారు.

ఈ ఘటన నిన్న ఉదయం జరిగింది. ఈ సమాచారం యశ్ వరకు వెళ్లడంతో నిన్న సాయంత్రం యశ్ ఆ మరణించిన ముగ్గురి అభిమానుల కుటుంబాలని పరామర్శించి ఓదార్చాడు. యశ్ రావడంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. వారిని పరామర్శించిన అనంతరం యశ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఇంతమంది ఫ్యాన్స్ రావడం నా అదృష్టం. నేనెప్పుడూ నా కోసం బ్యానర్లు కట్టి హంగామా చేయమని అడగను. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజుకి మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఏమైనా అవుతుందేమో అని నేను భయపడుతున్నాను. అందరికి ఫ్యామిలీ ఫస్ట్. మీకు కూడా మీ కుటుంబమే ఫస్ట్ ఉండాలి. కుటుంబం తర్వాతే ఎవరైనా. నేను పుట్టిన రోజూ జరుపుకొను అంటే అభిమానులు బాధపడతారని నేను డైరెక్ట్ గా చెప్పట్లేదు. కరోనా నుంచే నేను పుట్టిన రోజు జరుపుకోవట్లేదు. ఇలాంటి బర్త్ డేలు ఎవరూ కోరుకోరు. డబ్బులు సాయం ఎవరైనా చేస్తారు. కానీ పోయిన కొడుకు తిరిగి రాడు. మీరు ఇలా చేయడం వల్ల నా పుట్టిన రోజంటేనే అసహ్యం వేస్తుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. అలాగే కొంతమంది అభిమానులు నా కార్ వెనక బైక్ మీద ఫాలో వాడుతూ స్పీడ్ గా వస్తున్నారు, దయచేసి అలా చేయకండి అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : Yash Birthday : కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టిన రోజు.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు మృతి..

అయితే యశ్ రావడంతో అభిమానులు ఆయన్ని వెంబడించారు. కొంతమంది బైక్స్ పై కారుని వెంబడించగా ఓ అభిమాని యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఈ సంగతి తెలిసి యశ్ అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్ళాడు.