Khiladi మరో సాంగ్ రిలీజ్.. క్యాచ్ మీ అంటూ ఇరగదీసిన డింపుల్!

మాస్ మాహారాజా రవితేజ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నాడు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..

Khiladi మరో సాంగ్ రిలీజ్.. క్యాచ్ మీ అంటూ ఇరగదీసిన డింపుల్!

Khiladi

Updated On : February 5, 2022 / 7:01 PM IST

Khiladi: మాస్ మాహారాజా రవితేజ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నాడు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఖిలాడి త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న టీం ఒక్కో సింగిల్ వదులుతూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫుల్ కిక్ సాంగ్ ఓ ఊపేయగా తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ ట్రీట్ వచ్చేసింది.

Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

ఖిలాడీ మేకర్స్‌ తాజాగా ఈ సినిమా మంచి మరో మాంచి మాస్‌ మసాలా సాంగ్‌ ను వదిలారు. క్యాచ్‌ మీ అంటూ సాగే ఈ పాటలో.. డింపుల్‌ హయాతీ, రవితేజ మధ్య హాట్‌ సీన్స్‌ బాగా వర్కౌట్‌ అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్‌ అందాల ఆరబోత పాటకే హైలేట్‌ కాగా.. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, శేఖర్ మాస్టర్ స్టెప్పులు కూడా దుమ్ములేసిపోయింది.

Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియేస్, ఎల్ఎల్పీ బ్యానర్లపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. అర్జున్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.