Khushbu : వారసుడు సినిమా నుంచి ఆ నటి సీన్స్ ని తొలిగించారా? లేదా నటినే మార్చేశారా??

నేపథ్యంలో సీనియర్ నటి ఖుష్బుని సినిమా నుంచి తొలిగించినట్టు సమాచారం వస్తుంది. సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్, రష్మిక మందన్నతో కలిసి ఖుష్బు ఓ సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసి.. మంచి సినిమాలో చేస్తున్నాను అని గతంలో పోస్ట్ చేసింది........................

Khushbu : వారసుడు సినిమా నుంచి ఆ నటి సీన్స్ ని తొలిగించారా? లేదా నటినే మార్చేశారా??

Khushbu scenes removed from varasudu movie

Updated On : January 13, 2023 / 2:06 PM IST

Khushbu :  తమిళ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా వరిసు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే జనవరి 11న తమిళ్ లో రిలీజయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. జనవరి 14న తెలుగులో కూడా రిలీజ్ కానుంది.

అయితే ఇప్పటికే తమిళ్ లో సినిమా చూసేయడంతో కథ, సినిమా ఎలా ఉంది, సినిమాలోని అంశాలు ఏంటి అని బయటకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నటి ఖుష్బుని సినిమా నుంచి తొలిగించినట్టు సమాచారం వస్తుంది. సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్, రష్మిక మందన్నతో కలిసి ఖుష్బు ఓ సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసి.. మంచి సినిమాలో చేస్తున్నాను అని గతంలో పోస్ట్ చేసింది.

Waltair Veerayya : షో ఆలస్యం.. వీరయ్య అభిమానుల ఆగ్రహం.. థియేటర్ అద్దాలు ధ్వంసం..

అయితే సినిమా చూసిన తర్వాత సినిమాలో ఖుష్బు కనపడలేదు. ఒకప్పుడు ఖుష్బు హీరోయిన్ గా ఉన్నప్పుడు తమిళ్ లో ఆమెకి వీర లెవల్లో ఫాలోయింగ్ ఉండేది. ఆమెకోసం అభిమానులు గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఆమె అభిమానులు సినిమాలో ఆమె కనపడలేదు అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఖుష్బూ క్యారెక్టర్ ని ఎడిటింగ్ లో తీసేశారా? లేక ఆమెని తీసేసి ఆమె ప్లేస్ లో జయసుధని తీసుకున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఖుష్బు అభిమానులు సీరియస్ అవుతూ చిత్ర యూనిట్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. మరి అంత పెద్ద యాక్టర్ సన్నివేశాలని తొలిగించారా? లేక ఆమె బదులు వేరే వాళ్ళతో చేయించారా? ఒకవేళ అలా చేస్తే ఎందుకు అని అంతా ఆలోచిస్తున్నారు.