బట్టల్లేకుండా ఫోటోషూట్: స్టార్ హీరోయిన్‌పై ట్రోలింగ్

  • Published By: vamsi ,Published On : February 19, 2020 / 02:31 AM IST
బట్టల్లేకుండా ఫోటోషూట్: స్టార్ హీరోయిన్‌పై ట్రోలింగ్

Kiara Advani (Image:Instagram)

Updated On : February 19, 2020 / 2:31 AM IST

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న భామ కియారా అద్వాని. టీమిండియా క్రికెటర్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఎం.ఎస్.ధోనీ.. ది అన్‌టోల్డ్ కహాని’ సినిమాతో కథానాయికగా ఆమెకు బ్రేక్ వచ్చింది. తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ రామ్ చరణ్ హీరోగా ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామ అర్జున్ రెడ్డి రీమేక్‌ ‘కబీర్ సింగ్’లో షాహిద్ కపూర్‌తో నటించి గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలోనే ఇయర్ ఎండింగ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ అందుకుంది. అప్పట్లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి పాపులర్ అయిన ఈ భామ మరోసారి తన అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించింది.

లేటెస్ట్‌గా కియారా డబూ రత్నానీ ఫోటో షూట్‌లో ఒంటి మీద ఒక్క బట్టలు లేకుండా ఆకును అడ్డుగా పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. కియారా చేసిన ఈ ఫోటో షూట్ పై నెటిజన్స్‌ ట్రోల్స్ చేస్తున్నారు.

kiara advani

ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీబాంబ్‌’ సినిమాలో నటిస్తోంది. ‘కాంచన’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ‘ఇందూ కీ జవానీ’ అనే మరో  సినిమాలో చేస్తుంది.