విజయ్ దేవరకొండ సాయం విజేతగా నిలిపింది

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి..

  • Published By: sekhar ,Published On : February 15, 2020 / 09:51 AM IST
విజయ్ దేవరకొండ సాయం విజేతగా నిలిపింది

Updated On : February 15, 2020 / 9:51 AM IST

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి..

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన KickBoxer Ganesh Embari.. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. విజయ్ స్థాపించిన ‘‘Deverakonda Foundation’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్‌కు దోహదపడింది. మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌కి పోటీపడుతున్నాడు.

 

Kick Boxer Ganesh wins Gold Medal with the Help of Vijay Deverakonda's Foundation

 

కానీ అక్కడ పాల్గొనేందుకు కావాల్సిన ఫీజ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు.. ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ ‘‘Deverakonda Foundation’’ ద్వారా పార్టిసిపేషన్ ఫీజ్ రూ.24 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. ఫిబ్రవరి 1న విజయ్ దేవరకొండ తండ్రి దేవరకొండ గోవర్ధన్ రావు చెక్‌ను క్రీడాకారుడు గణేష్‌కు అందజేశారు.

ఆ సహాయంతో న్యూడిల్లీ వెళ్ళిన గణేష్ ఈ నెల 13న జరిగిన WAKO INDIAN OPEN INTERNATIONAL KICKBOXING CHAMPIONSHIP 2020 పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో విజయ్ చేసిన ఆ సహాయం వల్లే తాను పోటీల్లో పార్టిసిపేట్ చేయగలిగి, గోల్డ్ మెడల్ సాధించాననీ KickBoxer Ganesh Embari సంతోషం వ్యక్తం చేశాడు.

 

 

Read Here>>ఓ భర్త వీర ప్రేమగాథ: భార్య శవం పక్కనే నిద్ర..నేను చచ్చే వరకూ ఇంతే..